రాష్ట్రీయం

10 కొత్త ముఖాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) లోక్‌సభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం ప్రకటించారు. ఖరారు చేసిన అభ్యర్థులను ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ఆ వెంటనే బి-్ఫమ్‌లను అందజేశారు. ముందుగా ప్రకటించిన విధంగా సిట్టింగ్ ఎంపీలలో నలుగురికి టికెట్లు నిరాకరించారు. వీరిలో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నారు. అభ్యర్థులలో ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు ఉండగా, పది మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. అభ్యర్థుల జాబితాలో సిట్టింగ్‌లు దక్కించుకున్న నియోజకవర్గాలలో కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్ నుంచి జీ. నగేశ్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్ ఉన్నారు. సిట్టింగ్‌ల స్థానంలో టికెట్లు దక్కించుకున్న వారిలో మహబూబ్‌నగర్ నుంచి మనె్న శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్‌రావు, నల్లగొండ నుంచి వేమిరెడ్డి నరసింహరెడ్డి, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత ఉన్నారు. కాగా మిగిలిన స్థానాలలో సికింద్రాబాద్ నుంచి తలసాని సాయికిరణ్ యాదవ్, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డి, చేవెళ్ల నుంచి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి నేతకాని వెంకటేశ్, నాగరుకర్నూల్ నుంచి పొతుగంటి రాములు, హైదరాబాద్ నుంచి పుస్తే శ్రీకాంత్ ఉన్నారు.
కొత్తగా ఎంపీ టికెట్ దక్కించుకున్నవారు
*
మహబూబ్‌నగర్ - మనె్న శ్రీనివాస్‌రెడ్డి
మహబూబాబాద్ - మాలోతు కవిత
మల్కాజ్‌గిరి - మర్రి రాజశేఖర్‌రెడ్డి
చేవెళ్ల - డాక్టర్ రంజిత్‌రెడ్డి
ఖమ్మం - నామా నాగేశ్వర్‌రావు
నల్లగొండ - వేమిరెడ్డి నరసింహరెడ్డి
పెద్దపల్లి - నేతగాని వెంకటేశ్
సికింద్రాబాద్ - సాయి కిరణ్ యాదవ్
నాగర్‌కర్నూల్ - పోతుగంటి రాములు
హైదరాబాద్ - పుస్తె శ్రీకాంత్
టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ అభ్యర్థులు
కరీంనగర్ - బోయినపల్లి వినోద్‌కుమార్
నిజామాబాద్ - కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్ - జీ. నగేశ్
జహీరాబాద్ - బీబీ పాటిల్
మెదక్ - కొత్త ప్రభాకర్‌రెడ్డి
వరంగల్ - పసునూరి దయాకర్
భువనగిరి - బూర నర్సయ్యగౌడ్