రాష్ట్రీయం

ఉత్తమ ర్యాంకర్లకు ఫీజు రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఉత్తమ ర్యాంకర్లకు ఫీజు రాయితీలను ఇవ్వనున్నట్టు గీతం విశ్వవిద్యాలయం ప్రకటించింది. జేఈఈ మెయిన్స్‌లో 1 నుండి 250 ర్యాంకుల్లోపు సాధించిన వారు గీతంలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, 251 నుండి 2500 ర్యాంకులు సాధించిన వారికి 75 శాతం, 2501 నుండి 6వేల ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం, 6001 నుండి 35వేల ర్యాంకు వరకూ 25 శాతం ఫీజు రాయితీ ఉంటుందని అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అన్నారు. అలాగే ఏపీ , తెలంగాణల్లో 1 నుండి 50 ర్యాంకులు సాధించిన వారు ఫీజు చెల్లించనక్కర్లేదని, 51 నుండి 500 ర్యాంకులు సాధించిన వారు 75 శాతం, 501 నుండి 2000 ర్యాంకులు సాధించిన వారు 50 శాతం, 2001 నుండి 15వేల ర్యాంకు సాధించిన వారు 25 శాతం ఫీజులో రాయితీ పొందవచ్చని ఆయన చెప్పారు. ప్రతి ఏటా 8.5 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ సాధించిన విద్యార్థులకు ఈ రాయితీ కొనసాగుతుందని అలాగే 8.0 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ సాధించిన రెండు శాతం విద్యార్ధులకు 50 వేలు రాయితీ కొనసాగుతుందని చెప్పారు. ఎంటెక్ విద్యార్థులకు టీచింగ్ అసిస్టెంట్‌షిప్‌తో పాటు అందరికీ ఉపకార వేతనాలు ఇస్తున్నామని అన్నారు.
అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తొమ్మిది బీటెక్, ఏడు ఎంటెక్, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. దరఖాస్తులను మార్చి 30లోగా సమర్పించాలని, ఏప్రిల్ 10 నుండి 22 వరకూ ప్రవేశపరీక్షలు జరుగుతాయని అన్నారు. తుది ఫలితాలను ఏప్రిల్ 26న వెల్లడిస్తామని చెప్పారు.