తెలంగాణ

ఘరానా చైన్‌స్నాచర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: నగరంలోని వివిధ ప్రాంతాలలో గొలుసు దొంగతనాలకు పాల్పతున్న ఓ ఘరానా చైన్ స్నాచర్‌ను వనస్థలిపురం క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వనస్థలిపురం, మీర్‌పేట్ పోలీసు స్టేషన్ల పరిధిలో గత మూడేళ్లుగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న చల్లగాలి మురళీకృష్ణ రాజు 12 కేసుల్లో నిందితుడు. కాగా అతనిని నుంచి ఏడు లక్షలు విలువ చేసే 25తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పాలికొండకు చెందిన చల్లగాలి సత్యనారాయణ కుమారుడు మురళీకృష్ణ (24) డిగ్రీ పూర్తి చేసుకొని వనస్థలిపురం పనామా గోడౌన్స్ సమీపంలోని మారుతి షోరూంలో పనిచేస్తున్నాడు. కాగా మద్యానికి బానిసైన మురళీకృష్ణ అప్పులు చేశాడు. దీంతో ఉద్యోగం మానేసి చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్న మురళీకృష్ణ పత్రికల్లో వస్తున్న క్రైం వార్తలు, టివిల్లో ప్రసారమవుతున్న చైన్‌స్నాచింగ్‌ల కథనాలతో చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో చిల్లర దొంగతనాలు చేస్తూ నవంబర్ 2014లో వనస్థలిపురం, మీర్‌పేట్ పోలీసు స్టేషన్ల పరిధిలో 12 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఘరానా చైన్ స్నాచర్‌ను సైబరాబాద్ క్రైం విభాగానికి చెందిన ప్రత్యేక పోలీసు బృదం ఘరానా మోసగాడు మురళీకృష్ణను ఎట్టకేలకు పట్టుకుంది. పలు పోలీసు స్టేషన్లలో మురళీకృష్ణపై పది కేసులు నమోదై ఉన్నాయని, చైన్‌స్నాచింగ్‌లో సిద్దహస్తుడైన అతనిపై పిడి యాక్టు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
సంబల్‌పూర్, యశ్వంత్‌పూర్ మధ్య
డిసెంబర్, జనవరిలో ప్రత్యేక రైళ్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 2: అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని సంబల్‌పూర్, యశ్వంత్‌పూర్ మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది. సంబల్‌పూర్ నుంచి నెం.08301 రైలు డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో నడుస్తుందని తెలిపింది.
తిరుగు ప్రయాణంలో నెం.08302 యశ్వంత్‌పూర్-సంబల్‌పూర్ మధ్య డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఎల్‌టిటి ముంబయి-కాజిపేట్ మధ్య నెం.01093 రైలు డిసెంబర్ 11, 18, 25 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో నెం.01094 కాజిపేట నుంచి డిసెంబర్ 12, 19, 26 తేదీల్లో నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది.

‘ప్రాథమిక ఆరోగ్యాన్ని ప్రైవేటుకు అప్పగించొద్దు’

హైదరాబాద్, డిసెంబర్ 2: ప్రాథమిక ఆరోగ్యాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టవద్దని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ-వైద్య సంస్థలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నిర్వహణను అప్పగించడం అంటే పేదల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చడమేనని అన్నారు. ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించకుండా విస్మరించి గత కాంగ్రెస్, టిడిపి విధానాలనే అమలు జరపాలని భావించడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సుమారు 945 ఉన్నాయని, వీటిలో నాలుగు కేంద్రాలను ప్రయోగాత్మాకంగా ఈ-వైద్య సంస్థకు అప్పగించి, ఫలితాలను బట్టి రాష్టమ్రంతా విస్తరించే విధంగా చూడాలని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారని వీరభద్రం తెలిపారు. ఇలా చేయడం వైద్యాన్ని వ్యాపారీకరణ చేయడం తప్ప మరొకటి కాదని ఆయన ఖండించారు.