రాష్ట్రీయం

29 నుంచి కేసీఆర్ సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ బహిరంగ సభలతో శంఖారావం పూరించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచార సభలకు తేదీలను కూడా ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4 వరకు 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహించబోతున్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి చోట్ల కేసీఆర్ సభలు జరగున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచార సభలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల మూడు నియోజకవర్గాలకు కలిపి ఒకే చోట హైదరాబాద్‌లో ఎల్‌బి స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికలకు బరిలోకి దింపిన అభ్యర్థులంతా కొత్తవారే కావడంతో (ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు మినహా) వీరిని గెలిపించే బాధ్యతలను సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రులు, ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలకు అప్పగించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు ప్రతి రోజు పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్లు చేస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి పార్టీ అధిష్ఠానమే కార్యాచరణను ఖరారు చేసి పంపిస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమించిన ఇంచార్జీలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మార్గదర్శకం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం వీయడంతో అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలుస్తామన్న అతి విశ్వాసం ఏమాత్రం తగదని కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల విజయం ఒక్కటే ముఖ్యం కాదని, ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ కంటే పార్లమెంట్ అభ్యర్థులకు రెట్టింపు మెజారిటీ తీసుకరావాడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థులు కూడా అంతా మంత్రులు, ఎమ్మెల్యేలే చూసుకుంటారన్న ధీమాతో నిర్లక్ష్యం వహించవద్దని కేసీఆర్ హెచ్చరించినట్టు తెలిసింది.
పర్యటన వివరాలు
మార్చి 29న (శుక్రవారం): సాయంత్రం 4 గంటలకు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సభ మిర్యాలగూడలో,
సాయంత్రం 5.30 గంటలకు ల్‌బి స్టేడియంలో మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల (పార్ట్) నియోజకవర్గాల సభ
మార్చి 31న (ఆదివారం): సాయంత్రం 4 గంటలకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ సభ వనపర్తిలో,
సాయంత్రం 5.30 గంటలకు మహబూబ్‌నగర్ సభ జిల్లా కేంద్రంలో
ఏప్రిల్ 1 (సోమవారం): పెద్దపల్లి నియోజకవర్గ సభ సాయంత్రం 4 గంటలకు రామగుండంలో
ఏప్రిల్ 2 (మంగళవారం): వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ సాయంత్రం 4 గంటలకు వరంగల్‌లో
సాయంత్రం 5.30 గంటలకు భువనగిరి నియోజకవర్గ సభ భువనగిరిలో
ఏప్రిల్ 3 (బుధవారం): సాయంత్రం 4 గంటలకు జహీరాబాద్ నియోజకవర్గ సభ ఆందోల్‌లో
సాయంత్రం 5.30 గంటలకు మెదక్ నియోజకవర్గం సభ నర్సాపూర్‌లో
ఏప్రిల్ 4 (గురువారం): సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ నియోజకవర్గం సభ మహబూబాబాద్‌లో
సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం నియోజకవర్గం సభ ఖమ్మంలో..