రాష్ట్రీయం

ఏప్రిల్ 20 నుంచి ఏపీ ఎంసెట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మార్చి 23: ఏపీ ఎంసెట్-2019 ఏప్రిల్ 20వ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం రామలింగరాజు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎంసెట్-19 పరీక్ష నిర్వహణను కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వరుసగా ఐదవసారి, కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) పద్ధతిలో నిర్వహించడం మూడవ సారని చెప్పారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుండి 23 వరకు, అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు ఏప్రిల్ 23 నుండి 24వ తేదీవరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలియజేశారు. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ విభాగానికి లక్షా 50,774 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి 69446 మంది దరఖాస్తుచేసుకున్నట్లు పేర్కొన్నారు.
రెండు విభాగాలకు 1092 మంది, మొత్తం 2 లక్షల 21 వేల 312 మంది దరఖాస్తు చేసుకున్నారని ఛైర్మన్ రామలింగరాజు వివరించారు. విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను 27వ తేదీవరకు అందజేయవచ్చన్నారు. 500 రూపాయల అపరాధ రుసుంతో ఏప్రిల్ 4వ తేదీవరకు, వెయ్యి రూపాయల అపరాధ రుసుంతో ఏప్రిల్ 9వ తేదీవరకు, ఐదువేల రూపాయల అపరాధ రుసుంతో ఏప్రిల్ 14 వరకు, 10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 19వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టిక్కెట్‌లను ఏప్రిల్ 16వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులో విద్యార్థి ఎంపిక చేసుకున్న మూడు రీజినల్ సెంటర్లలోని పరీక్షాకేంద్రాన్ని దాదాపుగా అందరికీ కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంసెట్ ఫలితాలకు సంబంధించి ఎంసెట్ మార్కుల నుండి 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కుల నుండి 25 శాతం వెయిటేజీ తీసుకుంటామన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, పారా మెడికల్ టెక్నాలజీ (బీఎస్సీ పారామెడికల్), బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్) కోర్సులలో ప్రవేశాలు పొందగోరే అభ్యర్థులు సైతం ఏపీ ఎంసెట్-19కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారానే వారికి ఆయా కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తామని ఛైర్మన్ రామలింగరాజు పేర్కొన్నారు. ఎంసెట్ శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం సిటీ, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో జరుగుతాయని తెలిపారు. వీటితోపాటు గుంటూరు, నరసారావుపేట, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, గుత్తి, హిందూపూర్, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్, ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్ ఎంపిక చేసిన కేంద్రాల్లో జరుగుతాయన్నారు. ఇతర వివరాల కోసం 0884-2340535, 0884-2356255 నంబర్లను సంప్రదించాలని ఛైర్మన్ ప్రొఫెసర్ రామలింగరాజు తెలిపారు.