రాష్ట్రీయం

సెంట్రల్ యూనివర్శిటీలో కొత్త కోర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ 2019-20 విద్యాసంవత్సరానికి కొత్త పీజీ కోర్సులను ప్రారంభిస్తోంది. దాంతో పాటు సీట్ల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించింది. అప్లయిడ్ జియాలజీ, సంస్కృతం, మైక్రో ఎలక్ట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ తదితర బ్రాంచిలను ప్రారంభించడమేగాక, సీట్లను 1900 నుండి 2140కు పెంచుతోంది. ఈమేరకు శుక్రవారం నాడు జరిగిన అకడమిక్ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ సైన్స్, సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ , బయోటెక్నాలజీ కోర్సులనూ ప్రవేశపెడుతున్నారు. నానో సైన్స్‌లో ఎంటెక్, ఆంధ్రోపాలజీ, రీజనల్ స్టడీస్‌లో ఎంఫిల్ కోర్సులు, హిందీ, ఆంధ్రోపాలజీలో పీహెచ్‌డీ కోర్సులను కూడా ఈ ఏడాది ప్రారంభిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో టాపర్లతో పాటు ఈబీసీలో టాపర్‌కు సైతం ఈ ఏడాది మెడల్స్ ఇవ్వాలని అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించింది.
జాతీయ స్పెల్‌బీ టాపర్ కార్తీకరెడ్డి
హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్పెల్‌బీ సెమిఫైనల్ పోటీల్లో రాజమండ్రికి చెందిన ట్రిప్స్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థి కర్రి కార్తిక్ రెడ్డి టాపర్‌గా నిలిచాడు. కార్తీకరెడ్డిని ఐటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శైలేంద్ర త్యాగి, మిర్చి ఏక్టివేషన్ హెడ్ పునీత్ మెహ్రాలు అభినందించారు. నేషనల్ ఛాంపియన్‌కు రెండు లక్షల రూపాయిల నగదు పురస్కారం ఉంటుందని వారు చెప్పారు.