రాష్ట్రీయం

సీమ తులసివనంలో జగన్ గంజాయి మొక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్వేలు/రాయచోటి, మార్చి 24: కడప జిల్లాకు ఉన్న ‘దేవుని కడప’ అన్న మంచిపేరు పోయి ‘రాక్షసుల కడప’ అన్న పేరు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, యోగివేమన లాంటి మహానుభావులు పుట్టిన తులసివనం లాంటి ఈ గడ్డలో గంజాయి మొక్కలా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కడప జిల్లా బద్వేలు, రాయచోటిలో జరిగిన బహిరంగసభల్లో చంద్రబాబు మాట్లాడుతూ కడప పేరు జగన్ వల్ల చెడిపోతోందన్నారు. మహానుభావులు పుట్టిన గడపతో జరుగుతున్న హత్యా రాజకీయాలతో రాష్ట్రం అంతా కడప వైపు చూస్తోందన్నారు. దేశంలో 31 కేసులున్న ఏకైక నాయకుడు జగన్ ఒక్కడేనని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగడుగునా జగన్‌కు సాయం చేస్తున్నారన్నారు. కేసీఆర్ మన రాష్ట్రంపై కక్షబూనారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే జగన్‌తో కలిసి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు. వీరి మోసాలను ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. విభజన ఏకపక్షంగా జరిగిందంటూ ఇప్పటికి కూడా కేసీఆర్ ఆంధ్రులు ద్రోహులంటూ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. రిటర్న్ గిప్టు ఇస్తానంటూ చెబుతున్న కేసీఆర్‌కు వంద రిటర్న్ గిప్టులు ఇస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి వేసే ఓటు కేసీఆర్‌కు గుణపాఠం కావాలని బాబు కోరారు. కేసీఆర్ పంపించే డబ్బు మూటలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని, ఆ డబ్బులు వైకాపా నాయకుల జేబులు నింపుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపైన ఇటు ప్రతిపక్ష నాయకుడు జగన్, అటు కేసీఆర్, నరేంద్ర మోదీ కక్షగట్టుకుని దాడి చేస్తున్నారని అన్నారు. వీరి దాడులకు బెదిరే ప్రసక్తేలే దన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తమను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీతో జతకట్టారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్, మోదీకి తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కేసీఆర్, మోదీ అంటే జగన్‌కు చాలా భయమని, నీ కాళ్లు మొక్తా బాంచన్.. అంటూ జగన్ వారిద్దరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహా భగీరథ ప్రయత్నంలా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్ అడ్డుపడుతూ కోర్టుకు వెళ్లాడన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అరాచకశక్తి జగన్ అని అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని వైఎస్ కుటుంబ సభ్యులే చంపి తమవారిపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని బాబు ప్రశ్నించారు. మీ ప్రచార ఛానళ్ల ద్వారా తప్పుడు సాంకేతాలు అందించి తెలుగుదేశం పార్టీపై నిందలు వేయడం మంచిది కాదన్నారు. మీ సొంత మామ గంగిరెడ్డి డాక్టరై ఉండి శవానికి ఏ విధంగా కుట్లు వేస్తారని ప్రశ్నించారు. బాబాయ్ చనిపోతే నీకు బాధ లేదా, నీకు మానవత్వం లేదా అని జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. తండ్రి చనిపోతే కూతురు దొంగ సాక్ష్యాలు సృష్టించి లెటర్ రూపంలో పోలీసులను అవమానపరచడం మంచిది కాదన్నారు.
వచ్చే ఎన్నికలలో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీవైపు ఉన్నంత వరకు ఏ శక్తులూ తనను ఏమీ చేయలేవని అన్నారు.
చిత్రం.. కడప జిల్లా బద్వేలులో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు