రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌ది నటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సెక్యులర్ పార్టీ లా నటిస్తూ, అందరినీ నమ్మించే ప్రయ త్నం చేస్తున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా విమర్శించారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా తాము 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్నామని కుంతియా ఆదివారం పార్టీ ఎమ్మె ల్సీ మహ్మద్ షబ్బీర్ అలీతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పా రు. సామాజిక న్యాయం కోసం పోరా టం చేస్తున్నామని కుంతియా తెలిపారు. టీజేఎస్, వామపక్షాలు తదితర సెక్యులర్ పార్టీలన్నీ తమకు మద్దతునివ్వాలని ఆయన కోరారు. ‘మీ పార్టీల అభ్యర్థులు లేని చోట తమకు మద్దతు ఇవ్వండి’ అని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి ‘బీ-టీం’ సీఎం కే. చంద్రశేఖర్ రావు అని ఆయన ఆరోపించారు. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ టీఆర్‌ఎస్, వైకాపా తమకు మిత్రపక్షాలే అని చెప్పిన విషయాన్ని కుంతియా ప్రస్తావించారు. బీజేపీ-టీఆర్‌ఎస్ ఒక్కటే అని ఈ ప్రకటనతో తేలిపోయిందన్నారు. అదేవిధంగా ఆంధ్రలో కూడా బీజేపీ-వైకాపా ఒక్కటేనని స్పష్టమైనట్టు చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకే పుల్వామా ఘటనను వాడుకోవాలని చూస్తున్నదని కుంతియా విమర్శించారు.
మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమి సాధించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ప్రశ్నించడం విస్మయం కలిగించిందన్నారు. కాంగ్రెస్ వల్లే దేశానికి స్వాతంత్య్రం లభించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లోగడ యువజన కాంగ్రెస్‌లో గుర్తింపునిచ్చిందన్న విషయాన్ని మరిచిపోరాదని ఆయన సూచించారు. అహంకారంతో వాడిన పదజాలాన్ని సీఎం బేషరతుగా ఉపసంహరించుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.