రాష్ట్రీయం

చేనేతకు రుణ మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మార్చి 25: చేనేత కార్మికులు మగ్గాల కోసం తీసుకున్న ప్రతి కుటుంబానికి రూ.3లక్షల వరకు రుణమాఫీ చేస్తానని, వారి కుటుంబానికి ఏటా ఉచితంగా రూ.24వేలు పెట్టుబడి అందజేస్తానని, 45 ఏళ్ళకే పింఛన్ అందజేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వరాలజల్లు కురిపించారు. సోమవారం సాయంత్రం చిత్తూరుజిల్లా పర్యటనలో భాగంగా మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండు రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. తాను ఏడాదిక్రితం చేపట్టిన పాదయాత్రలో చేనేత కార్మికుల సమస్యలు గమనించానన్నారు. ప్రభుత్వం చేనేత కుటుంబాలను ఆదుకోవడం లేదని కార్మికులు చెప్పిన మాటలు నేటికీ గుర్తున్నాయన్నారు. మరో 20రోజులలో వైకాపా ప్రభుత్వం రాబోతోందన్నారు. మదనపల్లె పట్టణంలో 35వేల చేనేత కుటుంబాలు ఉండగా, ప్రభుత్వం 3వేల కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాలు నామమాత్రంగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులు చేతిమగ్గాల కోసం రూ.3లక్షల వరకు చేసిన అప్పులు పూర్తిగా రుణమాఫీ చేస్తానని, ఏటా చేనేత కుటుంబానికి రూ.24వేలు పెట్టుబడి కింద ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల కుటుంబాలకు, మగ్గాలకు కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ కింద పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటే ఐదేళ్ళ టీడీపీ ప్రభుత్వం చేనేతలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. హంద్రీ-నీవా కోసం రూ.4700కోట్లు ఖర్చుచేసి కేవలం 90శాతం పూర్తిచేసి కంటితుడుపుగా నీరు తీసుకువచ్చి ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రతి వ్యక్తికి ఉచితంగా చదువులు చెప్పిస్తానని అన్నారు. మద్యంతో సామాన్య కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా అంచలంచెలుగా మద్య నిషేధం అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా చాలా అవసరమని, ప్రత్యేకహోదా అమలైతే పన్నులు కట్టనవసరం ఉండదన్నారు. ఉన్నత చదువులు పూర్తిచేసిన నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.30లక్షల పోస్టులు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తానన్నారు.
గత ఐదేళ్ళుగా మహిళల రుణమాఫీ ఇంతవరకు పూర్తిగా అమలుచేయ లేదని, ఎన్నికలలో మరోసారి అధికారం కోసం చంద్రబాబు ఇస్తున్న రూ.3వేలు తీసుకుని మోసపోవద్దని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గత ఎన్నికలలో అమలు చేయలేని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రూపులలో మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు నాలుగు విడతలుగా మాఫీ చేస్తానని, వడ్డీలేకుండా రుణాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన మాఫీ డబ్బులు వడ్డీలకే సరిపోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మూడుమాసాల నుంచి నిరుద్యోగులకు రూ.2వేలు వంతున భృతి చెల్లిస్తానని, గత ఆర్నెల్ల నుంచి అమలుచేసి మోసం చేస్తున్నారని ఆరోపించారు.ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా రూ.12,500 అందిస్తానన్నారు. రైతులు పండించిన పంటలకు ఖచ్చితమైన గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. రాయలసీమలో ఎక్కువగా సాగుచేసే టమోటాకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, మార్కెటింగ్‌లో మార్పులు తీసుకువచ్చి దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామన్నారు. పంటనష్టంపై పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఈ రోడ్‌షోలో వైసీపీ రాష్ట్రప్రధానకార్యదర్శి, పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మిధున్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నవాజ్‌బాష, పీలేరు అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి, నియోజకవర్గం సమన్వయకర్త గుండ్లూరి షమీంఅస్లాం, బీసీ నేత ఉదయకుమార్, జడ్పీటీసీలు భాస్కర్, సీహెచ్ రామచంద్రారెడ్డి, ఎంపీపీలు సుజన, జరీనాబేగం, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మదనపల్లెలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్‌షోలో రాజంపేట ఎంపీ,
మదనపల్లె అసెంబ్లీ అభ్యర్థులను పరిచయం చేస్తున్న వైసీపీ అధినేత జగన్