రాష్ట్రీయం

గులాబీ జెండా గెలిస్తే గులాం గిరీ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 25: భారత దేశానికి కావల్సింది చౌకీదార్లు కాదని, అసల్‌దార్, జిమ్మేదార్ లాంటి కేసీఆర్ నాయకత్వం కావాలని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రమైన సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఉమ్మడి జిల్లా నాయకులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే రాహుల్, మోదీలకు లాభమని ఎద్దేవా చేశారు. అదే టీఆర్‌ఎస్ గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్‌ఎస్ అని, గులాబీ జెండా గెలిస్తే గులాం గిరీ చేయక్కర్లేదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలని అని ఆయన అన్నారు. టికెట్లు కావాలన్నా, బి - ఫారం కావాలన్నా, బాత్ రూంకు పోవాలన్నా ఢిల్లీకి వెళ్లాలని ఆయన విమర్శించారు. ‘మన సమస్యలు ఢిల్లీలో పట్టించుకోరు. అందుకే 16 మంది కేసీఆర్ సైనికులను గెలిపిస్తే పేగులు తెగేదాకా కొట్లాడవచ్చు’ అని అన్నారు. ఇద్దరు ఎంపీలను గెలిపిస్తే తెలంగాణను తెచ్చిన సత్తా 16 మందిని గెలిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అంటే పడని వారు దేశంలో చాలా మంది ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీలతో 160 ఎంపీలకు పెరిగే అవకాశం ఉందన్నారు. 2014లో దేశంలో మోదీపై భ్రమలు ఉండేవని, నమ్మి ఓట్లేస్తే 280 సీట్లు వచ్చాయని, ఈ రోజు ఆ పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ వేడి తగ్గిందని, బీజేపీకి హోష్ లేదన్నారు. కాంగ్రెస్‌కు 110 సీట్ల కంటే ఎక్కువ వచ్చే స్థితి లేదన్నారు.టీఆర్‌ఎస్‌కు ఎంపీలుంటే బీడు భూములన్నింటికి నీరు వస్తుందన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో మనది కొత్త రాష్టమ్రని, అయితే తెలంగాణ ఉనికిని మోదీ గుర్తించలేదని ధ్వజమెత్తారు. 75 మంది కేంద్ర మంత్రులు ఉంటే తెలంగాణలో ఉన్న ఒకే ఒక మంత్రి దత్తాత్రేయను తొలగించారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ళలో కేవలం రెండు సార్లు మాత్రమే మోదీ తెలంగాణకు వచ్చారన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించని మోదీ, మంత్రి పదవి ఇవ్వని మోదీ, తెలంగాణకు మొకం చాటేసిన మోదీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు, మన వృత్తుల గురించి పట్టించుకునే నాయకుడు, చేతల నాయకుడు కవాలే తప్ప మాటల నాయకుడు కాదన్నారు. తెలంగాణలో సంక్షేమ రంగం అత్భుతంగా ఉందని, కాంగ్రెస్, బీజేపీలే సంక్షోభంలో ఉన్నాయన్నారు. తనకు 89 వేలు మెజార్టీ ఇచ్చిన సిరిసిల్ల ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఇవ్వాలని కోరారు. వినోద్‌కుమార్‌ను ఇక్కడ గెలిపిస్తే, కాలం కలిసి వస్తే కేంద్రంలో మంత్రి కావడం ఖాయమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అబ్బుర పడే రాష్ట్రంగా ఎదిగిందని, దేశం మన వైపు చూస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజల తీర్పు వైపు దేశం చూస్తున్నదని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ భానుప్రకాష్, లోక్‌సభ ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, కొండూరి రవీందర్‌రావు, ఆరెపల్లి మోహన్, ఈద శంకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

చిత్రం.. సిరిసిల్ల ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్