రాష్ట్రీయం

ఖమ్మం పార్లమెంట్‌కు 39 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 25: ఖమ్మం పార్లమెంట్‌కు 39నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు చివరిరోజైన సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడ నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకొని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములునాయక్‌లతో కలసి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి కూడ భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వద్దకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యేలు సంబాని చంద్రశేఖర్, మర్రి శశిధర్‌రెడ్డిలతో కలసి నామినేషన్ వేశారు. అయితే రేణుకాచౌదరి నామినేషన్ పత్రంలో కొన్ని ధృవపత్రాలు లేకపోవడంతో సుమారు 4 గంటల సేపు ఆమె ఆ పత్రాలు వచ్చేంత వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనే వేచిఉన్నారు. రేణుకకు మద్దతుగా టిడిపి శ్రేణులు కూడ భారీగా తరలిరావడం విశేషం. ఖమ్మం పార్లమెంట్‌లో బీజేపీ అభ్యర్థిగా వాసుదేవరావు, జనసేన అభ్యర్థిగా నరాల సత్యనారాయణ, సీపీఎం అభ్యిర్థిగా బోడ వెంకట్, బహుజన ముక్తిపార్టీ అభ్యర్థిగా లకావత్ నాగేశ్వరరావు, తెలంగాణ జనసమితి అభ్యర్థిగా గోపగాని శంకర్‌రావులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఇరు పార్టీల కార్యకర్తలు ఖమ్మం నగరానికి భారీగా చేరుకున్నారు.