రాష్ట్రీయం

తాత్కాలికంగా 16 రైళ్ళు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: దేశంలోని ప్రధాన నగరాల నుంచి బెంగళూరుకు నడుస్తున్న 16 రైళ్ళును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ద.మ. రైల్వే అధికారులు తెలిపారు. బెంగళూరు- ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నందున పలు రైళ్ళు రద్దుతో పాటు మరికొన్ని రైళ్ళను దారిమళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడిచే రైళ్ళ ఈనెల 28 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. కాచిగూడ- యశ్వంత్‌పూర్ (16570) యశ్వంత్‌పూర్- కాచిగూడ (16569). మచిలీపట్నం- యశ్వంత్‌పూర్ (17211) యశ్వంత్‌పూర్- మచిలీపట్నం (17212) బెంగళూర్- విజయవాడ (56530), విజయవాడ- బెంగళూరు (56504), సికింద్రాబాద్- యశ్వంత్‌పూర్ (12735), యశ్వంత్‌పూర్- సికింద్రాబాద్ (12736) పూరీ- యశ్వంత్‌పూర్ (22883), యశ్వంత్‌పూర్- పూరీ గరీబ్ద్ (22884). యశ్వంత్‌పూర్- లక్నో (22683), లక్నో- యశ్వంత్‌పూర్ (22684). జబల్‌పూర్- యశ్వంత్‌పూర్ (12194) యవ్వంత్‌పూర్- జబల్‌పూర్ (12193) భవనేశ్వర్- కేఎస్‌ఆర్ బెంగళూర్ (18463) కేఎస్‌ఆర్- భువనేశ్వర్ (18464) రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేశామని రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.