తెలంగాణ

ర్యాంకింగ్‌కు నోచుకోని పురాతన వర్శిటీలు.. పోటీకి దూరంగా 35 వర్శిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: విశ్వవిద్యాలయాల ప్రమాణాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థల దుస్థితి తాజాగా కేంద్రం ప్రకటించిన యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో స్పష్టమైంది. తెలంగాణలో ఆరు సంప్రదాయ వర్శిటీలు, ఏడు స్పెషలైజ్డ్ యూనివర్శిటీలు, మూడు సెంట్రల్ యూనివర్శిటీలు, రెండు డీమ్డ్ వర్శిటీలు, రెండు జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో 10 సంప్రదాయ వర్శిటీలు, 11 స్పెషలైజ్డ్ వర్శిటీలు, మరో ఐదు డీమ్డ్ వర్శిటీలు ఉన్నాయి. ఈ ఏడాదే జాతీయ స్థాయి విద్యాసంస్థలు మొదలయ్యాయి. మొత్తం మీద చూస్తే తెలంగాణలో 20 యూనివర్శిటీలు, ఆంధ్రాలో 26 యూనివర్శిటీలు ఉన్నాయి. వీటిలో ఆరు మాత్రమే మంచి ర్యాంకులకు నోచుకున్నాయి. మిగిలిన 40 విద్యాసంస్థలు కేంద్రప్రభుత్వం సూచించిన ప్రమాణాలకు ఆమడ దూరంలో ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా యూనివర్శిటీ 1926లో, ఆచార్య నాగార్జున వర్శిటీ 1976లో, ఎస్‌కెయు 1983లో ఏర్పాటయ్యాయి. మిగిలిన సంప్రదాయ వర్శిటీలు 2006 తర్వాత ఏర్పాటయ్యాయి. అంటే అవి నెలకొల్పి కూడా పదేళ్లు గడుస్తున్నాయి. కేంద్ర ర్యాంకింగ్స్‌లో శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ 63వ స్థానంలో నిలిచింది. అదే విధంగా 2006లో నెలకొల్పిన యోగి వేమన యూనివర్శిటీ 92, జేన్‌టీయూ(కే) 69వ స్థానం పొందినపుడు ఆంధ్రా, నాగార్జున, కృష్ణదేవరాయ వర్శిటీలు ఎందుకు నిలవలేకపోయాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. అలాగే తెలంగాణలోఉస్మానియా విశ్వవిద్యాలయానికి 33వ స్థానం లభించింది. కాకతీయ వర్శిటీ 1976లో నెలకొల్పారు. మిగిలిన వర్శిటీలు 2006 తర్వాత ఏర్పాటయ్యాయి. ఇఎఫ్‌ఎల్ 1972లోనూ, వౌలానా అజాద్ యూనివర్శిటీ 1996లోనూ నెలకొల్పారు. అవి కూడా కేంద్ర ప్రభుత్వ పోటీలో నిలవలేకపోయాయి. దేశంలో అగ్రగామి విశ్వవిద్యాలయాల జాబితాలో తెలంగాణకు చెందిన మూడు, ఆంధ్రాకు చెందిన మూడు విశ్వవిద్యాలయాలు చోటును సంపాదించుకున్నాయి. ఇంజనీరింగ్‌లో 1438 సంస్థలు, మేనేజిమెంట్‌లో 609, ఫార్మసీలో 454, ఆర్కిటెక్చర్‌లో 28, కాలేజీలు 803, యూనివర్శిటీలు 233... ర్యాంకింగ్స్ కోసం పోటీ పడ్డాయి. ర్యాంకింగ్‌ల కోసం పోటీపడాలంటేనే నేక్ గుర్తింపు, ఎన్‌బిఎ గుర్తింపు నిర్బంధం చేశారు. ర్యాంకింగ్స్ కేటాయించే ముందు బోధన, అభ్యసన వనరులు, పరిశోధనాత్మక ఉత్పాదకత, గ్రాడ్యుయేట్ల సంఖ్య పారామితులుగా తీసుకున్నారు. కాగా, ర్యాంకింగ్‌లకు రాష్ట్ర వర్శిటీలు డేటా సమర్పించకపోవడంపై ఏపి మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్
కారుకు జరిమానా
హైదరాబాద్, ఏప్రిల్ 6: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు బ్లాక్ స్టిక్కరింగ్ కలిగి ఉన్నారనే కారణంతో ఇద్దరు ప్రముఖులకు నగర ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎమ్మెల్సీ రంగారెడ్డికి చెందిన (ఏపి 05 ఎఎఫ్ 2233) హుందాయ్ వాహనానికి బ్లాక్ స్టిక్కరింగ్ ఉందని రూ.700 ఫైన్ విధించారు. మైత్రివనం వద్ద నటుడు జూనియర్ ఎన్‌టిఆర్ కారు (ఏపి 37 ఎఎక్స్ 9999) కారుకు రూ.700 ఫైన్ విధించినట్టు ఏసిపి మాసూమ్ బాషా తెలిపారు.