తెలంగాణ

పండుగలా బుక్‌ఫెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఒక పండుగ మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. ఈ నెల 18 నుంచి 27 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్‌ఫెయిర్ జరుగుతుందని తెలిపారు. బుక్‌ఫెయిర్‌ను గత ఏడాది ఆరు లక్షల మంది సందర్శిస్తే, ఈ ఏడాది ఇంకా ఎక్కువ మంది సందర్శిస్తారని ఆయన ఆకాంక్షించారు. బుధవారం ఆయన సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద హైదరాబాద్ బుక్ ఫెయిర్ మహాపుస్తక ప్రదర్శన గోడ పత్రికను రమణాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాన్ని నేస్తంగా భావించిన వారిలో వికాసం ఉంటుందని అన్నారు. పుస్తకం అందరికీ పవిత్రమైనదని, సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా పుస్తకమంటే చాలా మందికి ప్రాణమని ఆయన అన్నారు. హైదరాబాద్ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింభించేలా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఉంటున్నందున దీనికి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అన్న పేరు పెట్టారని తెలిపారు. బుక్‌ఫెయిర్ నిర్వాహకులు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించనున్న 29వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు 300 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హిందీ, ఇంగ్లీషు, తెలుగుతోపాటు దేశంలోని వివిధ ప్రాంతీయ భాషలకు చెందిన పుస్తకాలతో ఈ ప్రదర్శన ఉంటుందని అన్నారు. విద్యార్థులు, పిల్లలు ఉచితంగా ఈ పుస్తక ప్రదర్శన తిలకించవచ్చని తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ ఏడాది పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. కవయిత్రి సుభద్ర, శ్రీధర్‌రావ్ దేశ్‌పాండేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పుస్తక ప్రదర్శన పోస్టర్లను ఆవిష్కరిస్తున్న రమణాచారి