రాష్ట్రీయం

నవంబర్‌లోగా ఎన్నికలు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: నవంబర్ నెలలోగా కాకినాడ, కర్నూలు నగర పాలక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు నగర పాలక సంస్థలకు ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపి అడ్వకేట్ జనరల్ పి వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం ఈ రెండు నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ముందు నిర్వహించాల్సి ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 23వ తేదీలోపల పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు తమకు 45 నుంచి 60 రోజులు అవసరమవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం నవంబర్ నెలలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.