క్రైమ్/లీగల్

బతుకమ్మ చీరల ఉత్పత్తిలో.. బినామీ మ్యాక్స్ సొసైటీలపై విజిలెన్స్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 7: బతుకమ్మ చీరల ఉత్పత్తిలో బోగస్ పవర్‌లూం మ్యాక్స్ సొసైటీ వ్యవహారం, నాసిరకం నూలు వినియోగం ఉదంతాలపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈమేరకు గత వారం రోజులుగా మ్యాక్స్ సంఘాల ప్రతినిథులతో విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
సిరిసిల్ల పట్టణంలో మ్యాక్స్ పవర్‌లూం సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా బతుకమ్మ చీరలను ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందర్భంగా అందించే ఈ చీరల ఉత్పత్తులన్నింటినీ సిరిసిల్లలోని కార్మికులకు, వస్త్ర ఉత్పత్తిదారులకు ఉపాధి కల్పించడానికి ఇక్కడే ప్రభుత్వం ఉత్పత్తి చేయిస్తున్నది. అయితే చేనేత జౌళి శాఖ సూచించిన ముడి సరుకులు, నూలును మాత్రమే వాడాలని, అధికారులు సూచించిన నిబంధనలను పాటించాలని ఇచ్చిన ఆర్డర్లలో ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా సిరిసిల్లలో కొందరు అధికార పార్టీకి చెందిన వ్యాపారులు ఇద్దరు ముగ్గురు కలిసి మొత్తం మ్యాక్స్ సంఘాలను తమ గుప్పిట్లోకి తీసుకుని, బినామీలు ఉత్పత్తులను సాగిస్తున్న విషయంపై ఇక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చేనేత జౌళి శాఖ అధికారులకు ఫిర్యాదులు కూడా రాగా, తాజాగా కొద్ది రోజుల క్రితం నాణ్యత గల పడుగు (ప్యాక) నూలును ఉపయోగించకుండా, స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసి బతుకమ్మ చీరలు ఉత్పత్తులు చేస్తున్న వైనంపై ఫిర్యాదులు అందడంతో దీనిపై అధికారులు సంబంధిత యూనిట్లు, మ్యాక్స్ సంఘాలకు చెందిన పవర్‌లూంలపై దాడులు నిర్వహించారు. ఈమేరకు నాసిరకం నూలు వినియోగిస్తున్నారనే అభియోగంపై ఆరు మ్యాక్స్ సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లను బ్లాక్ లిస్టులో పెడుతూ, వాటికి ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఉత్పత్తుల ఆర్డర్లను కూడా రద్దు చేశారు. ఇది ఇలా ఉండగా తాజాగా బినామీలు మ్యాక్స్ సంఘాల పేరుతో ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలపై, అలాగే నాసిరకం నూలు వినియోగంపై పోలీసు శాఖ నుంచి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా కొందరు మ్యాక్స్ సంఘాల అధ్యక్షులను పిలిపించి విచారణ జరిపి, వివరాలను సేకరించారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల వివరాలు, మ్యాక్స్ సంఘాల వ్యవహారం, చేనేత జౌళి శాఖలో పని చేస్తున్న నేత కార్మిక ఫెసిలిటేటర్ల విధులపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది.