రాష్ట్రీయం

మార్కెట్లకు మంచిరోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద మార్కెట్‌లతో తెలంగాణలోని మార్కెట్‌లను అనుసంధానం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 250 వ్యవసాయ మార్కెట్‌లను గుర్తించి, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్‌తో అనుసంధానిస్తున్నారు. వాటిలో 44 తెలంగాణ వ్యవసాయ మార్కెట్లు ఉండటం గమనార్హం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న ప్రధానమంత్రి మోదీ మార్కెట్ల అనుసంధాన ప్రక్రియను స్వయంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన నిజమాబాద్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ల అనుసంధానం, గోదాముల నిర్మాణం, స్థల సేకరణ వంటి అంశాలపై మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు గురువారం అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి దశలో 22 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అనుసంధానాన్ని ప్రధానమంత్రి అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభిస్తారు. వీటిలో ఐదు మార్కెట్ కమిటీలు తెలంగాణలోనే ఉన్నాయి. నిజామాబాద్‌లో పసుపు, తిరుమల గిరిలో ధాన్యం, వరంగల్‌లో మక్కలు, హైదరాబాద్‌లో మిర్చి, బాదేపల్లిలో ధాన్యం అమ్మకాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మార్కెట్ల చట్టం 1966లో కొన్ని సెక్షన్లలో మార్పులు చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ మార్కెట్‌లను ప్రతిష్టాత్మకంగా చేపట్టనుందని, దీనిలో రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌లను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. 44 వ్యవసాయ మార్కెట్ యార్డులను ఎంపిక చేసి ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తే, అనుమతి లభించినట్టు హరీశ్‌రావు చెప్పారు. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా ఎక్కడి నుంచైనా వ్యాపారులు, కొనుగోలుదారులు నామ్ పోర్టల్ ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు చేయవచ్చు. ఇది కొత్త మార్కెట్ కాదు, అదే విధంగా ప్రత్యామ్నాయ మార్కెట్ కూడా కాదని ఇప్పుడున్న మార్కెట్ యార్డులను కంప్యూటరీకరించి ఆన్‌లైన్ ద్వారా విక్రయించడమేనని తెలిపారు. దీని వల్ల కొనుగోలు దారులకు, అమ్మకందారులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు.