తెలంగాణ

బాక్సైట్ ఒప్పందాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 8: విశాఖపట్నం జిల్లా మన్యం నుంచి బాక్సైట్ ముడి ఖనిజం తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి) ద్వారా ఆన్‌రాక్, జిందాల్ సౌత్, వెస్ట్ లిమిటెడ్ (జెఎస్‌డబ్ల్యు)కు బాక్సైట్ ముడి ఖనిజాన్ని సరఫరా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయు) కుదుర్చుకున్న సంగతి విదితమే. అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బాక్సైట్ ఒప్పందాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపే బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ముందుకు సాగలేకపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బాక్సైట్ ఒప్పందాలు పూర్తిగా రద్దుచేస్తారని అంతా భావించారు. అయితే పాత ఒప్పందాల జోలికిపోకుండా తెలుగుదేశం ప్రభుత్వం జిఓ 97 విడుదల చేసింది. దీనిపై కొంతకాలంగా రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ఉద్యమం చేపట్టాయి. ఇదిలాఉండగా బాక్సైట్ ముడి ఖనిజాన్ని సరఫరా చేసేందుకు ఎపిఎండిసి చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉత్తర్వులను మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయడం గమనార్హం. ఇదిలాఉండగా విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ ముడిఖనిజం సరఫరాకు సంబంధించి ఎపిఎండిసి, ఆన్‌రాక్, జిందాల్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు పూర్తి లోపభూయిష్టంగా ఉన్నాయని కంప్ట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించింది. బాక్సైట్ ఖనిజం విలువను తక్కువగా చూపించినట్టు కాగ్ గుర్తించింది. అలాగే ఎపిఎండిసి ద్వారా తవ్వకాలు జరుగుతున్న గ్రానైట్ ఇతర ఖనిజాల సరఫరాకు సంబంధించి 11 శాతం వాటా కొనసాగుతుండగా, బాక్సైట్ విషయానికొచ్చే సరికి 1.5 శాతం మాత్రమే దక్కేలా ఎంఓయు కుదుర్చుకోవడంపై కూడా కాగ్ అనుమానం వ్యక్తం చేసింది. దీనివల్ల వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని హెచ్చరించింది. కాగ్ హెచ్చరికలు, విపక్షాల ఆందోళన నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తూ భారీ పరిశ్రమల శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో విడుదల చేసిన 97 జిఓ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ హయాంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిన ప్రభుత్వం, వాటి స్థానే కొత్త ఒప్పందాలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కాగ్ ఆక్షేపణల నేపథ్యంలో పాత ఒప్పందాలను రద్దుచేస్తూనే అవే సంస్థలు, లేనిపక్షంలో కొత్త సంస్థలకు బాక్సైట్ ముడి ఖనిజం సరఫరా చేసే వెసులుబాటును ప్రభుత్వం తనవద్దే ఉంచుకోవడం కొసమెరుపు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న విపక్షాలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 97 జిఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.