రాష్ట్రీయం

రాష్ట్రంలో నేడు వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ కొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా సాధారణంగా శ్రీరామనవమి పండగ తర్వాత చాలా చోట్ల ఒక మోస్తరు నుండి సాధారణ వర్షాలు కురవడం పరిపాటే. గత అనేక దశాబ్దాల నుండి ఈ విధానం కొనసాగుతూనే ఉంది. కొన్నిచోట్ల రామనవమి జరిగిన రాత్రే వర్షాలు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో రామనవని తర్వాతి రోజు వర్షాలు కురుస్తుంటాయి. మొత్తం మీద రామనవమి తర్వాత ఒకటి రెండురోజుల పాటు వర్షాలు కురవడం సాధారణంగా జరుగుతూ వస్తోంది. ఎండా కాలం అయినప్పటికీ, రామనవమి తర్వాత వర్షాలు ఎందుకు కురుస్తాయో శాస్ర్తియంగా వెల్లడి కాలేదు.