రాష్ట్రీయం

యాదాద్రీశుని మూలవిరాట్‌పై వీడియో చిత్రీకరణకు సహకరించిందెవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 14: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలనుకుంటున్న తరుణంలో మూలవిరాట్టును కెమెరాతో చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌చేసిన సంఘటనలో అధికారుల నిర్లక్ష్యం, భద్రతలో డొల్లతనం బట్ట బయలైంది. స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్టు వీడియో యూట్యూబ్‌లో దర్శనమివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంత జరిగినా వీడియో చిత్రీకరించి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన రాకేష్, నవీన్‌లపై కేసులు నమోదుచేసి ఘనకార్యం సాధించినట్లుగా చెప్పుకుంటున్న పోలీసు అధికారులు అందుకు సహకరించిన అధికారులు, భద్రత సిబ్బందిని విచారించి చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గంటసేపు యథేచ్ఛగా చిత్రీకరణ
బోనం రాకేష్, నవీన్‌లు ఎడిటింగ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో చిత్రం నిడివి 11 నిమిషాలుండగా అందుకుగాను కనీసం గంటసేపు షూటింగ్ చేస్తేగాని ఆ మాత్రం వీడియో క్లిప్పింగ్ తయారు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు, దర్శించుకునేందుకు వస్తున్న భక్తులను బాలాలయంలోకి అనుమతించకుండా ప్రత్యేక రోజుల్లో లఘు దర్శనానికే పరిమితం చేస్తూ, బాలాలయ గర్భాలయంలో ఫొటోల చిత్రీకరణకు అనుమతించని అధికారులు గర్భగుడిలో స్వయంభువుల చిత్రీకరణకు ఎలా అనుమతించారనేది వెయ్య డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అధికారులు, భద్రతా సిబ్బంది సహకారంతోనే ఈ దుస్సంఘటన చోటుచేసుకున్నదని ఆలయ సిబ్బంది బాహాటంగానే చర్చించుకుంటున్నారు.