రాష్ట్రీయం

నేటి నుంచి దుర్గగుడి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఏప్రిల్ 14: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి, శాంతిస్వరూపిణి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 15 నుండి 22 వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ తెలిపారు. శ్రీ మల్లిఖార్జున మహామంటపం 1వ అంతస్తులో ఆదివారం ఉదయం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ వికారి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి రోజు సోమవారం ఉదయం 8.30 గంటలకు శ్రీ గంగాపార్వతీ (దుర్గా) సమేత శ్రీ మల్లేశ్వర స్వామికి మంగళస్నానాలు చేయించిన అనంతరం నూతన వధూవరులుగా అలంకరించటంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఇందులోభాగంగా 17న రాత్రి 10.30 గంటలకు వైభవంగా శ్రీ గంగా పార్వతీ (దుర్గా) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దివ్య లీలాకల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 15న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామికి గజవాహన సేవ, 16న రావణ వాహన సేవ, 17న నందివాహన సేవ, 18న సింహవాహన సేవ, 19న వెండి రథోత్సవ ఊరేగింపు నిర్వహించనున్నట్లు చెప్పారు. 19న ఉదయం 9గంటలకు పూర్ణాహుతి, వసంతోత్సవం, 20న ప్రత్యేక పూజలు, 21, 22న సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి ఘనంగా పవళింపు సేవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.