రాష్ట్రీయం

రామతీర్థంలో పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా సీతారామా కల్యాణం కనుల పండుగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల శ్రీరామ స్మరణం మధ్య సీతారామ కల్యాణం వేడుకగా నిర్వహించారు.ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన ఈ కల్యాణ ఘట్టానికి టీటీడీ నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ కమిషనర్ పద్మావతి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. అలాగే సింహాచలం దేవస్థానం నుంచి కూడా స్వామివారికి పట్టువస్త్రాలు అందాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు సీతారామచంద్ర ప్రభువుకి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణానికి వేలాది మంది భక్తులు హాజరై ఆద్యంతం కల్యాణ ఘట్టాన్ని తిలకించారు. కల్యాణ ఘట్టానికి నంద్యాల నుంచి వచ్చిన బీవీ హయగ్రీవ ఆచార్యులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శ్రీరామనవిమి సందర్భంగా అభిజిత్ లగ్నం సరిగ్గా 12 గంటల సమయంలో వేదపండితులు జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవం మంచి ముత్యాలతో తలంబ్రాలు కార్యక్రమాన్ని వేడుకగా జరిపించారు. అలాగే ఈ ఏడాది స్వామివారి కల్యాణానికి గోటి తలంబ్రాలను ఉపయోగించారు.తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో పలువురు భక్తులు గోటితో వలిచిన తలంబ్రాలను వినియోగించారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం వారు ఈ తలంబ్రాలను సమర్పించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ దామోదర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, ఎంపీపీ సువ్వాడ వనజాక్షి పాల్గొన్నారు.

చిత్రం... రామతీర్థంలో స్వామివారి కల్యాణాన్ని జరిపిస్తున్న వేదపండితులు