రాష్ట్రీయం

ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: పోటీ చేస్తున్న 16కుగాను 16 లోక్‌సభ సీట్లు మనమే గెలువబోతున్నాం2 అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం పట్టారన్నారు. టీఆర్‌ఎస్ గెలిచే 16 ఎంపీ సీట్లతో ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయడానికి ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి కేసీఆర్
ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో యుద్ధం ఏకపక్షంగా జరిగిందని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సృష్టించిన ప్రభంజనం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పార్టీ నిర్వహించిన సర్వేలే కాకుండా, 10 ఇతర సంస్థలు చేసిన సర్వేలు కూడా టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలుచుకోబోతుందని తేల్చాయని కేసీఆర్ గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అవసరమైన సీట్లను గెలిచే పరిస్థితి లేదని తేలిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేనని, దాంట్లో టీఆర్‌ఎస్ పాత్ర కీలకంగా, నిర్ణయాత్మకంగా ఉండబోతుందని ఆయన అన్నారు. పార్టీ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే కొన్ని సాహసోపేత నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. రెవెన్యూ, మున్సిపాలిటీల్లో లంచం ఇవ్వనిదే పని జరిగే పరిస్థితి లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలు లోపభూయిష్టంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి చట్టంలో మార్పులు తీసుకరావాలని భావిస్తున్నామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా తయారైందో ప్రజలకు వివరించడంతో పాటు కొత్త చట్టం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై సమాయత్తం చేసే బాధ్యత పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూ చట్టంలో చేయనున్న మార్పులపై ఒకవేళ ఆ శాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగినా, ప్రజలు ప్రభుత్వం పక్షం నిలబడేలా వారిలో చైతన్యం తీసుకరావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చినట్టు సమాచారం. అంతకుముందు రెవెన్యూ, మున్సిపల్ చట్టాల్లో చేయనున్న మార్పులపై పార్టీ నేతల అభిప్రాయాలను కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
చిత్రం.... తెలంగాణ భవన్‌లో సోమవారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు పార్టీ నేతలు,
ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్