తెలంగాణ

వయసును జయంచాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 8: మారిన వాతావరణం, ఆహార అలవాట్ల నేపథ్యంలో నాలుగు పదుల వయస్సు రాక ముందే పని చేయడానికి ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో నాలుగు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా తాటి చెట్లు ఎక్కుతూ అతి కష్టమైన పని చేస్తూ అబ్బుర పరుస్తున్నాడు ఆ వృద్ధుడు. నిత్యం శ్రమ చేస్తూ, వేళకు మంచి భోజనం చేస్తే ఎంతటి కష్టమైన పని చేయవచ్చని ఆయన నిరుపిస్తున్నాడు. మండలంలోని రాగినేడు గ్రామానికి చందిన పడాల వీరయ్యగౌడ్ (86) అనే వృద్ధుడు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తాటి చెట్లు ఎక్కి గీత గీసి కళ్లు తీసుకు వస్తున్నాడు. ఈ వయస్సులో కూడా సైకిల్‌పై వెళ్లి గీత కార్మికునిగా ప్రతి రోజు 150 నుంచి 300 రూపాయల వరకు డబ్బు కూడా సంపాదిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయన ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు కాగా, అందరికి వివాహం చేయగా, ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు. తన భార్య గత మూడేళ్ల కిందట మరణించగా, తానే స్వయంగా వంట చేసుకొని గీత కార్మిక వృత్తిని నమ్ముకొని ఎవరిపై ఆదారపడకుండా కాలం గడుపుతున్నాడు. నాలుగు పదుల వయస్సు రాగానే గుండె జబ్బు, చక్కెర వ్యాధి వంటి రకరకాల వ్యాధులతో ఎంతో మంది బాధపడుతూ పని చేయలేని పరస్థితి ఏర్పడుతోంది. వాతావరణ కాలుష్యం, కలుషితమైన ఆహారం వల్ల చాలా మంది ఆయువు ప్రమాణ స్థాయి కూడా క్షీణించి పోతుంది. 60 సంవత్సరాలు ఏలాంటి వ్యాధి లేకుండా ఈ కాలంలో జీవించడం కష్టతరమవుతున్నది. ఆ వయస్సుకు రాగానే నడవ లేని పరస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యం శ్రమ చేయడంతో పాటు మంచి ఆహార అలవాట్లు చేసుకుంటే 100 సంవత్సరాలు పని చేస్తూ జీవించవచ్చని విశ్వాసం వ్యక్తం చేస్తున్న వీరయ్యగౌడ్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కోంటున్నారు.

వడదెబ్బతో అస్వస్థతకు గురై
పది మంది మృతి

నల్లగొండ / వరంగల్ / కరీంనగర్ / నిజామాబాద్, ఏప్రిల్ 8: ప్రచండ భానుడి తీవ్రత రోజురోజుకు పెరు గుతోంది. ఎండల ధాటికి జనం అల్లా డిపోతున్నారు. పిట్టల్లా రాలి పోతు న్నారు. రాష్టవ్య్రాప్తంగా శుక్ర వారం పది మంది ఎండల తీవ్రతకు వడ దెబ్బతో అస్వస్థతకు లోనై మృత్యు వాత పడ్డారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన జెల్ల ఈశ్వరమ్మ (78) గత రెండురోజులుగా ఎండలు తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురై శుక్రవా రం మృతిచెందగా.. ఇదే జిల్లా నేరే డుచర్లకు చెందిన వృద్ధ కళా కారుడు కందిబండ గోపయ్య (85), భువన గిరికి చెందిన బి. కృష్ణ య్య (80), తుంగతుర్తి మండలకేంద్రంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన పూజల బుచ్చమ్మ వడ దెబ్బతో మృతి చెందారు. వరంగల్ జిల్లా కురవి మం డలంలోని అయ్య గారిపల్లి గ్రామం లో శ్రీపతి భద్రమ్మ (50), గోవిం దరావు పేట మండలం చల్యాయి గ్రామానికి చెందిన వేల్పుల సమ్మయ్య (62) వడదెబ్బతో అస్వ స్థతకు గురై మరణించారు. అలాగే, కరీంనగర్ జిల్లా కమలాపూర్‌కు చెందిన కులూరి సారయ్య (65) అనే దర్జీ వడదెబ్బకు అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఇదే జిల్లా జిల్లా ముత్తారం మండలం హరిపురం వెంకట రాజంకు గొర్రె లను మేప డానికి వెళ్లి అస్వస్థతకు గుర య్యాడు. ఆసుపత్రికి తరలిస్తుం డానే మార్గ మధ్యంలో మరణించాడు. కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మం డలం రేచుపల్లి శివారు కిమ్యానాయక్ తండా భూక్యా సురేష్ వడదెబ్బతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని మల్లుపల్లి తండాలో మనోవత్ లంబాడి రాజు (30) వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయాడు.
కౌలురైతు ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మం డలం వనె్నల్ (బి) గ్రామానికి చెందిన సాయన్న (50) అనే కౌలురైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తెలంగాణ పథకాలు భేష్

మిషన్ కాకతీయ.. భగీరథపై నీతి ఆయోగ్ దృష్టిఖ 12న హైదరాబాద్‌లో సదస్సు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణలో అమలు చేస్తున్న వివిధ పథకాల పట్ల కేంద్రం ఆసక్తి చూపుతోంది. ఆయా పథకాలను నమూనాగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను పరిశీలించాలంటూ నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది. ప్రధానంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అమలును కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోంది. దేశంలో ఇంకా చాలా గ్రామాలకు సురక్షితమైన మంచినీటి సరఫరా వ్యవస్థ లేదు. అలాంటి పరిస్థితిలో ఒక రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటిని ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కేంద్రం దృష్టిని ఆకర్షించాయి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో పరిమితమైన ప్రాంతానికి ఈ విధంగా మంచినీటిని అందించారు. అయితే తెలంగాణలో మాత్రం మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికీ అందించనున్నారు. ఇప్పటి వరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల పనులు ఏ విధంగా సాగుతున్నాయో, ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారో చర్చించేందుకు ఈనెల 12న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిష్టాత్మకమైన ఈ రెండు పథకాల అమలుకు పదివేల కోట్ల రూపాయల సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సాధ్యమైనంత త్వరగా ఈ పథకాలకు కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నీటిపారుదల శాఖ మంత్రికి తెలిపారు. ప్రజలందరికీ తాగునీటిని అందించే ఈ పథకం అద్భుతం అని, ఈ పథకం అమలు తీరును పరిశీలించి, ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ పథకం గురించి తెలంగాణ ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకున్నాయి. తెలంగాణ ప్రజల జీవనాడి చెరువుల వ్యవస్థను పునరుద్ధరించి వాటికి పూర్వవైభవం కల్పించేందుకు చేపట్టిన మిషన్ కాకతీయను కేంద్రం అభినందించింది. ఒకప్పుడు ఇజ్రాయిల్‌లో ఉన్న పరిస్థితులే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉన్నందున మిషన్ కాకతీయ ద్వారా పరిస్థితి మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం పై కేంద్రం ఆసక్తి చూపుతోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు, తన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని కేంద్రగృహనిర్మాణ పథకంతో కలిపి ఒకే స్కీమ్‌గా అమలు చేయాలని భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తంమీద తెలంగాణ పథకాలు కేంద్రంపై విస్తృత ప్రభావం చూపుతున్నాయి.

ఎడారి దేశంలో
ఆగిన వలస జీవి శ్వాస..!

స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం * గుండారంలో విషాదం

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 8: ఉన్న ఊరిలో ఉపాధి కరువైంది. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించినా ఆ కుటుంబానికి ఆర్ధాకలే మిగిలింది. కుటుంబ పోషణ తలకు మించిన భారమైంది. కన్న వాళ్లు, కట్టుకున్న భార్య, పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే తల్లడిల్లిపోయాడు. దొరికిన చోటల్లా అప్పులు చేసిన బడుగుజీవి సుడిది చంద్రయ్య (48) పరాయి దేశానికి పయనమయ్యాడు. నాలుగు రూకలు సంపాదించడానికి ఈ యేడాది ఫిబ్రవరి 10న గుండెపోటు రూపంలో కబళించింది. అతని మృతదేహం ఉగాది పండుగ రోజైన శుక్రవారం కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారానికి చేరుకుంది. శవపేటిక రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పస్తులను చూడలేక.. పరాయి దేశానికి..
చంద్రయ్య అతని భార్య లక్ష్మితో కలిసి ఉన్న ఊరిలో కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లల పోషణ తలకు మించిన భారమైంది. రోజు వచ్చే కూలీ డబ్బులు సరిపడక అందరూ పస్తులతో నెట్టుకొచ్చారు. పిల్లల దుస్థితిని చూసి తట్టుకోలేని చంద్రయ్య ఐదు మాసాల కిందట రూ.2 లక్షలు అప్పులు చేసి బహ్రెయిన్ దేశానికి వెళ్లాడు. రోజూలాగే.. పనికోసం బయలుదేరడానికి సిద్ధమవుతున్న క్రమంలో చంద్రయ్య ఒక్కసారిగా గదిలో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు.

తరగని జలసిరి!

రాచకొండ రాజుల నీటి నిర్వహణ అబ్బురం
గుట్టలపై అడుగంటని తటాకాలు

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఏప్రిల్ 8: నల్లగొండ జిల్లా రాచకొండ గుట్టల ప్రకృతి రమణీయత నడి వేసవిలోనూ ఆహ్లాదాన్ని పంచుతోంది. ముఖ్యంగా వర్షాభావం, కరవు, మండుటెండలతో జిల్లాలోని పలు పెద్ద చెరువులు సైతం ఎండిపోయిన నేపధ్యంలో రాచకొండ గుట్టలపై తటాకాలు ఎండిపోయి ఉంటాయనుకున్న వారి ఆలోచనలకు విరుద్ధంగా తటకాలు జలకళతో ఆకర్షిస్తున్నాయి. తటాకాలు వాటి చుట్టు పచ్చదనం నిండిన చెట్లు, గడ్డితో రాచకొండ జలసోయగం కనువిందు చేస్తూ.. నాటి రాచకొండ రాజుల జల విధానాన్ని ఔరా అనిపించేలా చేస్తుంది. పురాతన కోట గోడలు, ఆలయాలతో చారిత్రాత్మకంగా, పర్యాటకంగా ఆకట్టుకునే రాచకొండ వర్షాకాలంలో లోయలు, కొండల మధ్య జాలువారే సెలయేరులతో పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. అయితే ప్రస్తుతం వేసవిలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉన్నా.. రాళ్ల గుట్టలపై ఉన్న తటాకాలు, కుంటలు నీటితో కనిపిస్తుండటం ఆశ్చర్యానికి గురి చేయకమానదు. రేచర్ల పద్మనాయక వంశీయులలో ఆధ్యుడైన సింగమనాయక భూపాలుడు సంస్థాన్ నారాయణపూర్ పరిధిలోని గుట్టల మధ్య 600అడుగుల ఎత్తులపై సువిశాల కోటను నిర్మించారు. పద్మవంశీయ రాజులు 1352నుండి 1457వరకు రాచకొండను పాలించగా వారు ఇక్కడి ప్రజలకు, రైతులకు సాగుతాగునీరందించేందుకు గుట్టలపైన, గుట్టల మధ్యలో, లోయలకు అడ్డంగా వీలైనన్ని చోట్ల వర్షపునీటిని నిల్వ చేసేందుకు 100కుపైగా చెరువులు, కుంటలు నిర్మించి వ్యవసాయానికి, కోటలోని ప్రజల అవసరాలకు అనుసంధానించారు. వాటిలో చాలా వరకు ధ్వంసమవ్వగా కొన్నింటిని ప్రభుత్వాలు మరమ్మతులు జరిపించడంతో నేటికి ఇవే చెరువులు స్థానిక ప్రజల, గిరిజనుల, పశుపక్ష్యాదుల దాహర్తిని తీరుస్తుండటం విశేషం. ప్రధాన గుట్టపై రాజుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన తటాకంలోనైతే రెండేళ్లుగా సరైన వర్షాలు లేకున్నా ఎండిపోకుండా జలకళతో దర్శనమిస్తుండటం రాచకొండ రాజుల జల విధాన నైపుణ్యానికి దర్పణం పడుతుంది. ఇటీవల రాచకొండ గుట్టలలో ‘జానకిరాముడు’ అనే పౌరాణిక, ఇతీహాస టీవి సీరియల్ షూటింగ్ రెండు నెలల పాటు కొనసాగింది. షూటింగ్ సందర్భంగా వినియోగించిన గుర్రాల సంచారంతో రాచకొండ గుట్టలలో, తటాకాల్లో వాటి సందడితో రాచకొండ మరోసారి రాజరికపు కాలాన్ని తలపించింది. కాకతీయుల సామంతులైన పద్మనాయక రాజులు వ్యవసాయంతో పాటు సాహిత్య రంగాన్ని ప్రోత్సహించగా శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన బమ్మెర పోతన ఆస్థాన కవిగా వ్యవహరించారు. కవి సార్వభౌముడు శ్రీనాధుడు రాచకొండను సందర్శించి రాజుల దూరదృష్టితో కూడిన పరిపాలన కౌశలాన్ని కవితలలో కొనియాడారు. ఇంతటి ప్రత్యేకతలున్న రాచ కొండలో తెలంగాణ ప్రభుత్వం ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీల నిర్మాణ యోచన చేస్తుండగా అదే జరిగితే రాచకొండ ప్రకృతి రమణీయత ఎక్కడ దెబ్బతింటుందోనని వాటి కంటే పర్యాటక ప్రాంతంగా రాచ కొండను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వర్షాలకోసం బిజెపి
సుదర్శన యాగం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 8: వర్షాలు బాగా కురువాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ బిజెపి రాష్ట్ర నాయకులు సుదర్శన యాగం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన యాగం చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య జరిగిన యాగంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, పార్టీ ఇతర నాయకులు జి. ప్రేమేందర్ రెడ్డి, చింతా సాంబమూర్తి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశానంతరం కిషన్ రెడ్డి తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని, పశువులు అల్లాడుతున్నాయని, ప్రజలకు మంచి నీరు లభించక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడాలని వరుణ దేవున్ని ప్రార్థిస్తూ సుదర్శన యాగం చేశామని చెప్పారు. రాష్ట్రంలో తీవ్రవాదం పెరుగకుండా పూర్తిగా అణచివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిజెపి బలోపేతానికి తాము కృషి చేస్తున్నామని, యువత ముందుకు వచ్చి పార్టీలో చేరాలని ఆయన కోరారు.

రూ. 6కోట్ల విలువైన
ఎర్రచందనం పట్టివేత

తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు

రామాయంపేట, ఏప్రిల్ 8: అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ జిల్లా తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లు, క్లీనర్ అన్నాదురై వినాయకన్‌లను కోర్టులో హాజరు పరిచామన్నారు. చెన్నై-నాగ్‌పూర్‌కు స్మగ్లింగ్ చేస్తున్న ఈ ఎర్రచందనం విలువ ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని డిఎస్పీ స్పష్టం చేశారు. అందిన సమాచారం మేరకు సిఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున్‌గౌడ్‌లు రామాయంపేట బైపాస్ చేరుకొని చాకచక్యంగా లారీని పట్టుకొన్నట్లు చెప్పారు. లారీలో 166 దుంగలు (11 టన్నుల) ఉన్నాయన్నారు. సున్నం పర్మిట్ పేర రవాణా చేస్తూ చెక్‌పోస్టులను దాటి తమకు చిక్కిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ స్మగ్లింగ్ ముఠా ఎవరన్న దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వ్యక్తులను పట్టుకొనేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల వెంట ఎప్పటికప్పుడు అక్రమ రవాణాపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో రేంజర్ చంద్రశేఖర్‌తో పాటు స్థానిక పోలీసులు పాల్గొన్నారు.