రాష్ట్రీయం

నరుూమ్ ఆస్తుల విలువ రెండు వేల కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నరుూమ్ ఆస్తుల విలువ ఏకంగా రూ. రెండు వేల కోట్లు. ఈ విషయాన్ని నరుూమ్ కేసును విచారిస్తున్న సిట్ ప్రకటించింది. అతనిఆస్తుల్లో 1,019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. తెంలగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవాతో పాటు ముంబాయిలో ఉన్న ఇళ్లు, స్థలాలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన విధి విదానాలపై సిట్ అధికారులు న్యాయశాఖ నుంచి సలహాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. నరుూమ్‌కు సంబంధించిన అస్తులు ప్రస్తు తం కోర్టు ఆధీనంలో ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ నరుూమ్‌కు సంబంధించి మొత్తం 251 కేసులు నమోదు కాగా, వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది. కేసు దర్యాప్తును సిట్ మరో రెండు మాసాల్లో ముగించే అవకాశాలున్నాయి.

నరుూమ్ (ఫైల్ ఫొటో)