రాష్ట్రీయం

అకాల వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 17: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అకాల వర్షాలు మరోసారి రైతాంగాన్ని తీవ్ర నష్టాల పాలు చేశాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో విరుచుక పడిన అకాల వర్షం ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఐకేపి, పీఏసీఎస్ కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ఈదురుగాలులకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో పిడుగు పాటుకు గురై చనబోయిన రాణి (35), యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామంలో తాటిచెట్టు ఎక్కుతున్న గీతకార్మికుడు ఎరుకల సత్తయ్య (40) పిడుగుపాటుతో దుర్మరం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం జైకేసారంలో తాటిచెట్టుపై పిడుగు పడి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. ఆలేరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మోటాకొండూరు, అడ్డగూడురు, భువనగిరి, నల్లగొండ, తిప్పర్తి, గుర్రంపోడు, మాడ్గులపల్లి, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి కూడా అకాల వర్షాలు కొనసాగుతునే ఉండటంతో రైతాంగానికి కంటి మీద కునుకులేని పరిస్థితి నెలకొంది.
సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన చిలువేరు సమ్మయ్య (55) అనే రైతు బుధవారం సాయంత్రం పిడుగు పడి మృతి చెందాడు. .బొమ్మకల్ శివారులో గల మల్లన్న గుట్ట వద్ద తన వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులకు పశువులను కట్టివేయడానికి చెట్టు కిందకు వెళ్లగా ప్రమాద వశాత్తు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కూతురు, భార్య కేతమ్మ ఉన్నారు.
సంఘటనా స్థలానికి సైదాపూర్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక సర్పంచ్, ఎంపిటిసి, గ్రామస్థులు కోరుతున్నారు.
చిత్రాలు.. పిడుగుపాటుకు మృతి చెందిన గీత కార్మికుడు సత్తయ్య (గుండాల)
*మహిళా రైతు చెన్నబోయిన రాణి (కట్టంగూర్),* సమ్మయ్య (సైదాపూర్)