రాష్ట్రీయం

ఉగ్రవాదంపై రాజీలేని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరు చేస్తోందని, మానవ మనుగడకు, అభివృద్ధికి సవాలుగా పరిణమించిందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంకగా ముందుకు సాగేందుకు జైన మత సిద్ధాంతాలైన శాంతి, అహింసలు సమాజానికి దోహదం చేస్తాయన్నారు. దీనికి భారత స్వరాజ్య సంగ్రామమే ఉదాహరణ అని ఆయన అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జైన సేవా సంఘం నిర్వహించిన భగవాన్ మహవీర్ జయంతి ఉత్సవాల్లో ప్రసంగించారు. సత్య మార్గంలో సహనంగా ముందుకు సాగాలని ప్రవచించిన భగవాన్ మహవీరుని జీవితాన్ని సమకాలీన ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎదురవుతున్న అనేక ప్రశ్నలకు జైన తత్వంలో సమాధానాలు దొరుకుతాయన్నారు. సత్యం, అహింస, సర్వజీవుల పట్ల కరుణ లాం టి భగవాన్ మహావీరుని సందేశాలు సత్యమార్గంలో ప్రకాశించాయన్నారు. వారి బోధనలు కేవలం ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే కాకుండా నైతిక ధర్మానికి చుక్కానిగా నిలుస్తాయన్నారు. సమస్త మానవాళి శాంతి, సౌభాగ్యం దిశగా ప్రతి ఒక్కరినీ ఉత్తేజితం చేస్తాయన్నారు. ప్రేమ, శాంతి, సహనం, సోదర భావాలతో ఒకప్పుడు ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించిందన్నారు. అత్యున్నత విజ్ఞాన ఖనిగా భాసిల్లిన మన దేశం ప్రపంచానికి విశ్వగురు స్థానం వహించిందన్నారు. దీనిని తిరిగి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి ప్రసాదించిన వనరుల వాడకం విషయంలో సమాజం దృష్టికోణం మారాల్సి ఉందని ఆయన అన్నారు ఈ నేపథ్యంలో మన జీవన విధానాన్ని మార్చుకోవాలన్నారు. జైన ధర్మానికి త్రిరత్నాలు ఆధార భూతమైన సూత్రాలు సరైన నమ్మకం, సరైన వివేకాం, సరైన ప్రవర్తన ముఖ్యమని చెప్పారు. ఇవే కాకుండా సత్యం, అహింస, ఇతరుల వస్తువుల కోసం ఆశపడకపోవడం, దొంగతనం చేయకపోవడం , బ్రహ్మచర్య అనే ఐదు మార్గదర్శక సూత్రాలు జైన మతంలో ప్రధానమైనవన్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన వనరుల మీద మనకు హక్కు ఉంటే బాధ్యత ఎక్కువ ఉంటుందన్నారు. మన ముందు తరాలకు వాటని అదే విధంగా అందించాల్సిన ధర్మకర్తల్లాంటి బాధ్యత మనందరిదన్నారు. ఈ భూమికి ఇక్కడ ఉండే జీవజాలలానిక ఏ విధమైన హానీ చేయకుండా సమస్త విశ్వాన్ని ముందుకు తరాలకు యదావిథిగా అందించేందుకు ప్రతిన బూనాలన్నారు. సత్యమార్గంలో సహనంగా ముందు కదలాలని ఆయన కోరారు.
చిత్రం...భగవాన్ మహావీర్ జయంతి ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు