రాష్ట్రీయం

ఎమ్మెల్యే క్వార్టర్స్ సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో చేపట్టిన ఎమ్మెల్యేల నివాస భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సీఆర్‌డీఏ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి తన కార్యాలయంలో సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో రాజధాని పనుల పురోగతిని గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త శాసనసభ కొలువుదీరిన వెంటనే కొత్త సభ్యులు రాజధాని పరిధిలో ఉండేందుకు వీలుగా భవనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలను ప్రాధాన్య క్రమంలో గుర్తించి వాటిని వర్షాకాలం నాటికి సిద్ధం చేయాలని సూచించారు. రాజధాని నగరం నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ అందించే రహదారుల్లో ముందుగా న్యాయ వివాదాలు లేని రహదారులను గుర్తించి శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ రహదారులు సిద్ధమైతే రాజధానికి ఒక సమగ్ర ఆకృతి వస్తుందని, అమరావతికి రాకపోకలు పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పచ్చదనం, విద్యుత్ దీపాలతో ముఖ్య రహదారులను యుద్ధప్రాతిపదికపై సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంత వీలైతే అంత త్వరగా రాజధానికి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చాలన్నారు. రాజధానిలో రూ. 51,687 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని ముఖ్యమంత్రికి సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీ్ధర్ వివరించారు. 19,769 కోట్ల రూపాయల పనుల్లో 15,414 కోట్ల రూపాయల మేర పనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ భవన సముదాయాలకు మొత్తం 14,008 కోట్ల రూపాయల్లో 8786 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులన్నీ వచ్చే ఏదాడి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ భవనాల సముదాయాల పనులను ఆరు జోన్లుగా విభజించామని, మొదటి మూడు జోన్లలో పనులు చివరి దశకు చేరాయని వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నివాస భవనాలు ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి అవుతాయన్నారు. మంత్రులు, న్యాయమూర్తులు, ముఖ్యకార్యదర్శుల విల్లాల నిర్మాణం ఆగస్టు 16కు సిద్ధం అవుతాయన్నారు. సచివాలయం, విభాగాధిపతుల టవర్లు వచ్చే ఏడాది జూలై 18నాటికి పూర్తి చేస్తామన్నారు. హైకోర్టు ఐకానిక్ భవన నిర్మాణ తొలిదశ నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 నాటికి పూర్తి అవుతుందన్నారు. అసెంబ్లీ భవన నిర్మాణం పనులు టెండర్ దశకు చేరుకున్నాయన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా జరుగుతుండటంతో దాని ప్రభావం ఇక్కడి పనులపై పడిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులు ఓట్లు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లడంతో మానవ వనరుల సమస్య తలెత్తుతోందన్నారు. రాజధాని రహదారుల్లో ఇప్పటి నుంచే పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వర్షాకాలం నాటికి మొక్కలు నాటి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
చిత్రం..అమరావతిలో గురువారం సీఆర్‌డీఏ అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు