రాష్ట్రీయం

తెరపైకి మళ్లీ శాఖల విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: మంత్రివర్గ విస్తరణకు ముందు శాఖల విలీనంపై జరిగిన కసరత్తు మళ్లీ తెరపైకి వచ్చింది. వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ శాఖకు అనుబంధంగా మార్కెటింగ్, ఉద్యానవన, పౌరసరఫరాల శాఖలను పునర్ వ్యవస్థీకరించాలని ఆదేశించారు. పరిపాలనా వ్యవస్థల్లో తీసుకరానున్న సంస్కరణలకు అనుగుణంగా ఒకే అంశంతో కూడిన శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకరావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి శాఖల విలీనంపై ముఖ్యమంత్రికి ముసాయిదాను సమర్పించారు. కొన్ని చేర్పులు, మార్పులను ముఖ్యమంత్రి సూచించడంతో శాఖల విలీనంపై తుది కసరత్తు జరుగుతోంది. శాఖల విలీనంలో వ్యవసాయశాఖ పరిధిలోకి మార్కెటింగ్, సహకార, పౌర సరఫరాలశాఖలు రానున్నాయి. అలాగే భారీ, మధ్యతరహా, చిన్ననీటి వనరుల శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు చేర్చి నీటిపారుదలగా ఒకే శాఖ అవతరించనుంది. భారీ పరిశ్రమలు, మధ్య, చిన్న తరహా పరిశ్రమలశాఖలతో పాటు ఐటీ శాఖను కూడా దీని పరిధిలోకి రానున్నాయి. రహదారులు కొన్ని పంచాయతీరాజ్ పరిధిలో, మరికొన్ని రోడ్లు మరియు భవనాల పరిధిలో కొనసాగుతున్నాయి. అలాగే వౌలిక సదుపాయాల కల్పన సంస్థ విడిగా కొనసాగుతోంది. ఇక ముందు రోడ్లు, భవనాలు, వౌలిక సదుపాయాలన్నీ ఒకే గొడుగు కిందకు చేరనున్నాయి. సంక్షేమశాఖల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు వేర్వేరు శాఖలుగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చి సంక్షేమశాఖగా ఒకటే అవతరించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 34 శాఖలు ఉండగా వీటిని 18 నుంచి 20 శాఖలుగా కుదించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే 18 మంత్రులకు 18 శాఖలను కేటాయించడం వల్ల పరిపాలనా సులభతరంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా,ప్రాధమిక విద్యా వేర్వేరు శాఖలుగా ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చి విద్యాశాఖ మొత్తానికి ఒకే మంత్రిని నియమించడం వల్ల సత్ఫలితాలు ఇవ్వడంతో అదే తరహాలో శాఖలను కుదించి ఒకే అంశానికి సంబంధించిన శాఖకు ఒకే మంత్రిని నియమించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మంత్రివర్గ విస్తరణ జాప్యానికి అప్పట్లో శాఖల విలీనమే కారణమైంది. అయితే శాఖల విలీన ప్రక్రియ సకాలంలో పూర్తికాకపోవడంతో ప్రస్తుత శాఖలనే యధాతథంగా మంత్రులకు కేటాయించిన విషయం తెలిసిందే. మలి విడత మంత్రివర్గ విస్తరణకల్లా శాఖల విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారుల కసరత్తు చేస్తున్నారు.