రాష్ట్రీయం

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాజ్యాంగ పరిరక్షణ, సమాజ అభివృద్ధి సివిల్ సర్వెంట్ల అంతిమ లక్ష్యాలు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం అమరావతి సచివాలయంలో ఏపీ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో 13వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజ సర్వతోముఖాభివృద్ధి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాల సాధనలో అఖిల భారత సర్వీస్ అధికారులు చురుకైన పాత్ర పోషించాలన్నారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలు, విధివిధానాల్లో సివిల్ సర్వెంట్లదే కీలక భూమిక అన్నారు. అదేవిధంగా వారసత్వ సంపద, సంప్రదాయాలు, భాషా పరిరక్షణ, ప్రోత్సాహానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. సివిల్ సర్వెంట్ల జీవితం క్రికెట్ టోర్నమెంట్ లాంటిదని అభివర్ణించారు. ఒక్క బంతిని సరిగ్గా ఎదుర్కోకపోయినా ఓటమి తప్పదని స్పష్టం చేశారు. విలువల్ని పాటించటంలో కూడా సివిల్ సర్వీస్ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించాలన్నారు. దేశం మొత్తంగా ఏపీని మార్గస్థానంగా తీర్చిదిద్దే కృషిలో అందరూ భాగస్వాములు కావాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రశాంత మహాపాత్ర మాట్లాడుతూ సివిల్ సర్వెంట్ల విధానం దేశంలో ఎప్పటి నుంచో అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ముందుగా సివిల్ సర్వెంట్ల విధానమే అమలులో ఉండేదని చెపుతూ 1806లో ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. గుజరాత్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జనరల్, ఆ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా మాట్లాడుతూ రెగ్యులేటరీ సెక్టార్‌లో సివిల్ సర్వెంట్‌గా తను గడించిన అనుభవాలను పంచుకున్నారు. సివిల్ సర్వెంట్లు లీడర్‌షిప్ లక్షణాలు ప్రదర్శించాలని, శాంతిభద్రతలు, న్యాయవ్యవస్థ నియమాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలన్నారు. సమాజంలో పేదలు, బలహీన వర్గాల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాలన్నారు. కిందిస్థాయి ఉద్యోగులను ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలని కోరారు. ఉత్తమ విధానాల అమలుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ మావన వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డీ చక్రపాణి మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ విశ్రాంత ఈఎన్‌సీ కొండలరావు స్టేబుల్ రోడ్స్ ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంశంపై ప్రసంగించారు. భోజన విరామానంతరం ఒడిశా ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఫర్ రూరల్ ఇన్నోవేషన్‌కు చెందిన అనిల్ ప్రధాన్, మహారాష్ట్ర అకోలాకు చెందిన రిటైర్డ్ జెజడ్పీ సీఈఓ ఆయుష్ ప్రసాద్, సీతంపేట ఐటీడీఏ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి యూనిసెఫ్ డీఆర్‌ఆర్ అధికారి మహేంద్ర రాజారామ్, రిస్క్ ఇన్‌ఫార్మ్‌డ్, ప్రోగ్రాం ఫర్ రెసిలైన్స్ గురించి విశదీకరించారు. ఖమ్మం జిల్లా నీటిపారుదల శాఖ విశ్రాంత సీఈ ఆర్ పద్మనాభం, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు కె దమయంతి, ప్రవీణ్‌కుమార్, కార్యదర్శులు ఎన్ శ్రీకాంత్, సునీత, హెచ్ అరుణ్‌కుమార్, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు కోన శశిధర్, ఇంతియాజ్, జేసీలు హిమాంశు శుక్లా, కృతికా శుక్లా, అదనపు సీఈఓ వివేక్ యాదవ్, తదితర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
చిత్రాలు.. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాట్లాడుతున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం