రాష్ట్రీయం

అకాలవర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : అకాలవర్షంతో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం అతలాకుతలమైంది. పిడుగుపాటుకు, చెట్లు కూలిన సంఘటనల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నూజెండ్ల, వినుకొండ, బొల్లాపల్లి, కారంపూడి, దాచేపల్లి, ఈపూరు తదితర మండలాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం, మరోపక్క ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో శనివారం ప్రజలు నానా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించి ఈ వర్షం కురవడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోలేక పోయారు. జిల్లాలోని వినుకొండ, గురజాల నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పల్నాడు వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో కారంపూడి, ఈపూరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఇరువురు మృతిచెందారు. కారంపూడిలో ఎస్‌కె మస్తాన్‌బి, ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామానికి చెందిన సంగటి వెంకటేశ్వరరెడ్డి మృత్యువాతపడ్డారు. భారీ ఈదురుగాలుల ధాటికి కారంపూడిలో చెట్లు విరిగిపడి జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాచేపల్లిలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో గుంటూరు-హైదరాబాద్ రహదారి మురికికూపంగా మారింది. నూజెండ్ల మండలం ముతరాసుపాలెంనకు చెందిన చిక్కుడు వెంకట కోటయ్య (30) గెదేలను ఇంటికి తోలుకొస్తున్న సమయంలో పిడుగు పాటు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే పీబీసీ కెనాల్‌కు సాగర్ జలాల విడుదల చేసేందుకు వెళ్లిన లస్కర్ కర్రల సాంసన్ (57)పై చెట్టుకొమ్మ విరిగి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వినుకొండ మండలంలోని ఉప్పరపాలెంకు చెందిన గుమ్మా చిర్రయ్య (50) పిడుగుపాటుకు గురై రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అకాల వర్షానికి వరి, బొప్పాయి, మిర్చి రైతులు నష్టాల పాలయ్యారు. పలు చోట్ల ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

చిత్రాలు.. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో వరి ఓదెలను ముంచెత్తిన వర్షపు నీరు, *నూజెండ్లలో కూలిన చెట్టు.