రాష్ట్రీయం

‘పరిషత్’ షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లా ప్రజా పరిషత్ (జడ్‌పీపీ), మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ)లకు ఎన్నికల షెడ్యూల్ జారీ అయింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ. నాగిరెడ్డి శనివారం తమ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ షెడ్యూల్ జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండటం వల్ల ఇక్కడ పరిషత్ ఎన్నికలకు అవకాశం లేదు. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభమై 2019 మే 27వ తేదీతో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 539 జడ్‌పీటీసీ స్థానాలు ఉండగా 538 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట స్థానానికి న్యాయపరమైన కారణాల వల్ల ఎన్నిక నిర్వహించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5,857 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 5,817 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 40 ఎంపీటీసీ స్థానాలకు వ్యవధి (టర్మ్) పూర్తికాకపోవడం వల్ల వీటికి ఎన్నికలు నిర్వహించడం లేదు. జడ్‌పీపీ చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు తర్వాత వెల్లడిస్తామన్నారు. పరిషత్ ఎన్నికలు మూడు దశల్లో ఉంటాయని కమినర్ చెప్పారు. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తామని నాగిరెడ్డి వివరించారు. మే 27న ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ప్రకటిస్తామన్నారు. పోలింగ్‌కు ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపరు, బాక్యులను వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఎంపీటీసీ పోలింగ్‌కు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను, జడ్‌పీటీసీ పోలింగ్‌కు తెలుపురంగు బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తామన్నారు. మొదటి దశ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఈ నెల 22 న ‘నోటీస్’ జారీ చేస్తామని కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఒక్కో జడ్‌పీటీసీకి, ముగ్గురు ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. రిటర్నింగ్ అధికారే నోటీస్ జారీ చేస్తారని తెలిపారు. తొలిదశలో ఏప్రిల్ 22 నుండి 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 25న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని అన్నారు. అనర్హతకు గురైన అభ్యర్థులు అప్పీల్ చేసుకునేందుకు 26 వరకు సమయం ఉంటుంది. ఈ అప్పీళ్లను 27న సాయంత్రం 5 వరకు పరిష్కరిస్తారు. జడ్‌పీటీసీ అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌కు, ఎంపీటీసీ అభ్యర్థులు సబ్-కలెక్టర్/ఆర్‌డీఓకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 28న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా విధించారు. 3 గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. ఈ దశకు పోలింగ్ మే 6న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఎక్కడైనా రీపోల్ అవసరం అయితే ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. మే 27 ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుంది. రెండో దశ ఎన్నికలకు 2019 ఏప్రిల్ 26న ‘నోటీస్’ జారీ చేస్తారు. 26 నుండి 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29 న పరిశీలన ఉంటుంది. అదే రోజు అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఎవరైనా అప్పీల్ చేసుకోవాలంటే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఈ అప్పీళ్లను మే ఒకటోతేదీ సాయంత్రం వరకు పరిష్కరిస్తారు. మే 2 సాయంత్రం 3 గంటల వరకు పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 27న కౌంటింగ్ నిర్వహిస్తారు. మూడో దశ ఎన్నికలకు ఏప్రిల్ 30 న నోటీస్ జారీ చేస్తారు. ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 3న పరిశీలించి, అదేరోజు అర్హులైన అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 4వ తేదీ సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని మే 5న పరిష్కరిస్తారు. 6వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా విధించారు. అదే రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. 14వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీ-పోల్ అవసరం అయితే కమిషన్ ప్రకటన చేస్తుంది. తుదిదశకు కూడా ఓట్ల లెక్కింపు27న జరుగుతుంది.
చిత్రం... మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ. నాగిరెడ్డి