రాష్ట్రీయం

32 జడ్పీపీలు, 538 ఎంపీపీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో 32 జడ్పీపీలలో 539 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 538 జడ్పీపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ములుగు జిల్లాలోని మంగపేట జడ్పీటీసీ స్థానం అంశంపై కోర్టులో కేసు నడుస్తుండటంతో ఎన్నకలు జరగడం లేదు. అలాగే 539 ఎంపీపీలలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎంపీపీ పరిధిలోని 15 ఎంపీటీసీ స్థానాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గుంపాడు ఎంపీపీ పరిధిలోని 11 ఎంపీటీసీ స్థానాలకు, భద్రాచలం మండల ప్రజా పరిషత్ అధ్యక్షస్థానానికి ఎన్నికలు జరగడం లేదు. వీటి కాలపరిమితి 2020 వరకు ఉండటం వల్ల ప్రస్తుతం వీటికి ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. అలాగే ములుగు జిల్లాలోని మంగపేట ఎంపీపీ పరిధిలోని 14 ఎంపీటీసీ స్థానాలకు న్యాయపరమైన కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదని వివరించారు.