రాష్ట్రీయం

ఖర్చు పరిమితి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జడ్‌పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో ప్రచారం కోసం చేసే ఖర్చు పరిమితిని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జడ్‌పీటీసీ అభ్యర్థు లు నాలుగు లక్షల రూపాయల వరకు, ఎంపీటీసీ అభ్యర్థులు 1,50,000 రూపాయల వరకు ఖర్చు చేసేందుకు అనుమతించారు. ఖర్చుల వివరాలను అభ్యర్థులు సంబంధిత రిటర్నింగ్ అధికారికి నిర్ణీత కాలంలో అందించాల్సి ఉంటుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ వివరాలను అందించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఖర్చు వివరాలు అందించని వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని, తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని ఆయన వివరించారు. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ స్థానాలకోసం పోటీ చేసే అభ్యర్థులకు ప్రజలు నేరుగా ఓట్లు వేస్తారు. ఎక్కువ ఓట్లు లభించిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఒక జిల్లాలోని జడ్‌పీపీ అభ్యర్థులు తమలో ఒకరిని జడ్‌పీపీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు. అలాగే ఒక మండలంలోని ఎంపీటీసీలు తమలో ఒకరిని ఎంపీపీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.