రాష్ట్రీయం

రిజర్వేషన్ల వివరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో 32 జిల్లా ప్రజా పరిషత్తులు ఉండగా, వాటిలో నాలుగు జడ్‌పీపీ చైర్‌పర్సన్ స్థానాలు ఎస్‌టీలకు, ఐదు స్థానాలు ఎస్‌సీలకు, ఏడు స్థానాలు బీసీలకు రిజర్వ్ చేశారు. 16 స్థానాలు అన్-రిజర్వ్‌డ్‌గా ఉంటాయి. రిజర్వ్‌డ్‌తో పాటు అన్-రిజర్వ్‌డ్ స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎస్‌టీల క్యాటగిరీలో రెండు స్థానాలు, ఎస్‌సీల క్యాటగిరీలో మూడు స్థానాలు, బీసీల క్యాటగిరీలో మూడు స్థానాలు, అన్-రిజర్వ్‌డ్ స్థానాల్లో ఎనిమిది జడ్‌పీపీ చైర్‌పర్సన్ల స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. 538 మండల ప్రజా పరిషత్ అధ్యక్షస్థానాల్లో షెడ్యూల్డ్ ఏరియాల్లో 32 స్థానాలు ఎస్‌టీలకు (వీటిలో మహిళలకు 17) చెందుతాయి. ఇతర ప్రాంతాలోల 60 ఎంపీపీ (మహిళలకు 30) అధ్యక్షస్థానాలు ఎస్‌టీలకు, 98 స్థానాలు (మహిళలకు 49) ఎస్‌సీలకు, 95 స్థానాలు (మహిళలకు 48) బీసీలకు కేటాయించగా 253 స్థానాలు (మహిళలకు 125) అన్-రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. 539 జడ్‌పీటీసీ స్థానా ల్లో ఎస్‌టీలకు 79 (మహిళలకు 42), ఎస్‌సీలకు94 (మహిళలకు 51), బీసీలకు 90 (మహిళలకు 44), అన్-రిజర్వ్‌డ్ సానాలు 276 (మహిళలకు 138) ఉన్నాయి. ఎంపీటీసీ
స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఎంపీటీసీ స్థానాలు 5,843 కాగా వీటిలో షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్న 172 స్థానాలు (మహిళలకు 90) ఎస్‌టీలకు, 119 స్థానాలు (మహిళలకు 57) అన్-రిజర్వ్‌డ్‌గా ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని స్థానాల్లో ఎస్‌టీలకు 633 (మహిళలకు 350), ఎస్‌సీలకు 1,042 (మహిళలకు 543) రిజర్వ్ చేశారు. బీసీలకు 1,011 స్థానాలు (మహిళలకు 509) రిజర్వ్ చేశారు. అన్-రిజర్వ్‌డ్ స్థానాలుగా 2,866 ఉండగా వీటిలో 1,407 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు.