రాష్ట్రీయం

‘పరిషత్’కు ముందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్షం తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమయ్యే ప్రక్రియ వేగవంతమైంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి కావడానికి ఇటు పార్టీ మారనున్న ఎమ్మెల్యేలు, అటు టీఆర్‌ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ప్రతిపక్ష శాసనసభా పక్షం ఏకంగా పాలకపక్షంలో విలీనం కావడానికి సాంకేతికంగా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న్యాయ నిపుణులు, చట్టసభల నిపుణులతో గత రెండు, మూడు రోజులుగా చర్చలు జరపుతోంది. టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితో పాటు అదే పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనానికి సాంకేతికంగా ఉన్న అడ్డంకి తొలగిపోయినట్టు అయింది. మొత్తం శాసన సభ్యుల సంఖ్యలో 10 శాతం మంది ఎమ్మెల్యేలు (12 మంది) పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 120 కాగా (ఆంగ్లో ఇండియన్
నామినేటెడ్ సభ్యునితో కలిసి) ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్టు ప్రకటించారు. మరో ఇద్దరు సభ్యులు ముందుకోస్తే కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనానికి మార్గం సుగమం అవుతుంది. అయితే అవసరమైంది ఇద్దరు సభ్యులైతే ముగ్గురు సభ్యులు గ్రీన్ సిగ్నల్ తెలపడంతో పరిషత్ ఎన్నికలకు ముందే విలీన ప్రక్రియ పూర్తి చేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ మారునున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్ ఆదివారం టీఆర్‌ఎస్ శాసనసభ పక్షం కార్యాలయంలో సమావేశమై విలీన ప్రక్రియపై చర్చించారు. న్యాయ నిపుణులతో ఈ అంశాన్ని చర్చిస్తోన్నట్టు పై ముగ్గురు ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని కూడా వారు బయట పెట్టారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌లో మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలేనని పరోక్షంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీ్ధర్‌బాబు పేర్లను ప్రస్తావించారు. ఇలా ఉండగా టీఆర్‌ఎస్-1 ప్రభుత్వ హయాంలో టీడీపీ శాసనసభ పక్షం టీఆర్‌ఎస్ విలీనమైన విషయం తెలిసిందే. శాసనసభా పక్షం పాలకపక్షంలో విలీనం కావడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంటే సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గత హయాంలో టీడీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు విలీనమయ్యారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా వారిలో ఇప్పటికే 10 మంది టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. వీరితో పాటు మరో ముగ్గురు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి సంఖ్య 13కు చేరుకోనుంది. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ప్రతిపక్ష హోదా కోల్పోనుండగా అవసరమైన దానికంటే ఒక సభ్యుని సంఖ్య ఎక్కువే ఉండటంతో కాంగ్రెస్ శాసనసభా పక్షం వినీనానికి సాంకేతికంగా ఉన్న అడ్డంకి తొలగిపోయినట్టే. దీంతో త్వరలోనే కాంగ్రెస్ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టు స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు.