రాష్ట్రీయం

తొలిదశ పరిషత్ ‘నోటీస్’ నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పరిషత్ ఎన్నికలకు సంబంధించి తొలిదశ ఎన్నికలకు ‘నోటీస్’ సోమవారం విడుదల అవుతోంది. మూడు దశల్లో ఎన్నికలు జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో తొలిదశ ఎన్నికల కార్యక్రమం 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈనెల 22న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మే 6న వరకు కొనసాగుతుంది. తొలిదశలో 197 జడ్పీటీసీ సభ్యులు, 2,166 ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకునేందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు) తమతమ ప్రాంతాల్లో నోటీస్ జారీ చేస్తారు. ఎంపీడీఓలు, పంచాయతీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు, వ్యవసాయ అధికారులు, సహకార అధికారులు తదితర అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. 32 జిల్లాల్లోని 195 మండల ప్రజా పరిషత్తుల్లో తొలిదశ ఎన్నికలు నిర్వహిస్తారు. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో తొలిదశలోనే ఎన్నికలు పూర్తవుతాయి. ఈ జిల్లాలో ఐదు మండలాలు ఉండగా, నాలుగు జడ్పీటీసీ స్థానాలు, 22 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందువల్ల ఈ జిల్లాలో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతాయి. ఇలావుంటే, సోమవారం ఉదయం 10.30 గంటలకు నోటీస్ జారీ కాగానే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 25న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. పరిశీలన పూర్తికాగానే అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఎవరైనా అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఏవైనా కారణాల వల్ల తిరస్కరిస్తే, వారు అప్పీల్ చేసుకోవచ్చు. జడ్పీటీసీలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తే, సదరు అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్లలో ఏవైనా నామినేషన్లను తిరస్కరిస్తే, సంబంధిత అభ్యర్థులు ఆర్డీఓకు, సబ్-కలెక్టర్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. అంటే దరఖాస్తు చేసుకునేందుకు వీరికి కేవలం ఒకేరోజు సమయం ఉంటుం ది. ఈ దరఖాస్తులను కలెక్టర్, ఆర్డీఓ 27వ తేదీన పరిశీలిస్తారు. కలెక్టర్, ఆర్డీఓ కూడా వారి అభ్యర్థనను తిరస్కరిస్తే సదరు అభ్యర్థులు పోటీ చేసేందుకు వీలు ఉండదు. కలెక్టర్/ఆర్డీఓ అనుమతిస్తే వారి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఆమోదించాల్సి ఉంటుంది. 28వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ పత్రాల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అదే రోజు అంటే 28న సాయంత్రం 5 గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. తొలిదశ పోలింగ్ మే 6వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అంటే అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఆరో తేదీన పోలింగ్ జరిగినా ఓట్ల లెక్కింపు మాత్రం 2019 మే 27న జరుగుతుంది. ఎంపీటీసీల ఫలితాలు వెల్లడైన తర్వాత మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు రిటర్నింగ్ అధికారులు మళ్లీ ప్రత్యేకంగా నోటీస్ జారీ చేస్తారు.