రాష్ట్రీయం

చంద్రబాబు తేల్చేస్తారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 9: రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా నష్టపోయిన భద్రాచలం డివిజన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈ నెల 13వ తేదీన పర్యటించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ముంపు ప్రాంతాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు. ఆ తర్వాత నుంచి ఆ మండలాల ప్రజల యోగ క్షేమాలు అటు ఆంధ్రప్రదేశ్ గాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం గాని పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. భద్రాచలం పట్టణం మినహా చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భూములు కూడా ఏపిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాచలం చుట్టు పక్క ఉన్న నాలుగు గ్రామాలు తిరిగి తెలంగాణకు వస్తాయని వెల్లడించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన తొలిసారి ముంపు మండలమైన చింతూరులో చంద్రబాబు తలపెట్టిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పర్యటన తెలంగాణకు అప్రాధాన్యమైనప్పటికీ ముంపు మండలాల ప్రజల యోగక్షేమాలతో పాటు భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గ్రామాల బదలాయింపుపై ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే పోలవరం ముంపు పేరుతో నష్టపోతున్న ప్రజలను ఆదుకోవాలని సిపిఎం, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సిపిఐల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టే అవకాశం కూడా ఉంది. అలాగే ఆదివాసీ గిరిజన సంఘాలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేయనున్నాయి.
ఇదిలావుండగా రాష్ట్ర విభజన జరిగి దాదాపు రెండేళ్ళు కావస్తున్నా ముఖ్యమంత్రి కనీస పర్యటనలు జరపలేదనే ఆరోపణలున్నాయి. కేవలం ఒకరిద్దరు మంత్రులు మాత్రమే కూనవరం, కుక్కునూరు మండలాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ రాష్టమ్రంత్రులు ఆ ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనతో ముంపు మండలాల సమస్యలు పరిష్కారం అవుతాయని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వామపక్ష పార్టీల నేతలు, గిరిజన సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లోనే భద్రాచలం భవితవ్యం వెల్లడయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇరువురు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతున్నామని చెప్తున్న నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది.