రాష్ట్రీయం

విద్యుత్ శాఖకు రూ. 93 కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షానికి విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీని వల్ల విద్యుత్ శాఖకు సుమారు రూ. 93 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 33 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సమయం ఎక్కువ తీసుకుందని అధికారులు చెబుతున్నారు. ఈదురుగాలులు, వర్షానికి విద్యుత్‌కు శాఖకు భారీగా నష్టం జరిగిందని ట్రాన్సికో- జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, ఖమ్మం, కామారెడ్డి, ధర్మసాగర్, నిర్మల్ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వాటికి మర్మతులు చేయడానికి హుటాహుటిన సిబ్బందిని తరలించినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్‌లో ఉప్పల్, రామంతపూర్, తిరుమలగిరి, లలితానగర్‌లో మంగళవారం మధ్యాహ్నాం వరకూ విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఆయా ప్రాంతల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో విద్యుత్ అంతరాయంతో సర్వర్ లింక్ తెగిపోయింది. దీంతో మంగళవారం కార్యాలయానికి సెలవుప్రకటించారు. ఉప్పల్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ వర్క్ పనిచేయక పోవడంతో అక్కడ కూడా సర్వీసులు నిలిచిపోయాయి. ఈసీఐఎల్, ఆటోనగర్ ప్రాంతాల్లో తీవ్ర గాలులకు టవర్ కూలిపోయింది. షాబాద్ మండలం కుమ్మరిగూడ గ్రామంలో విద్యుత్ వైర్లు వరికుప్పలపై పడడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈదురు గాలుకు వందలాది విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. మర్మతులు చేపట్టడానికి విద్యుత్ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. రాష్ట్రంలో ఉమ్మడి పాత విద్యుత్ సర్కిల్స్‌లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టడానికి 760 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. పునరుద్ధరణ పనుల్లో విపత్తుల నిర్వహణ బృందాలు నిమగ్నమయ్యాయి. విద్యుత్ అంతరాయంపై ఫిర్యాదు చేయడానికి 23431178, 23431179 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికార వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
చిత్రం...గంభీరావుపేటలో ఈదురు గాలులకు నేలకొరిగిన ట్రాన్స్‌ఫార్మర్