రాష్ట్రీయం

ఆర్టీసీ కార్మికుల నిధులు విడుదల చేయకపోతే సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల నుంచి నెలనెలా వసూలు చేసిన సీసీఎస్, ఈపీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే సమ్మెకు దిగుతామని అధికార టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ అనుబంధ ఆర్టీసి కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బస్ భవన్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించింది. ఆర్టీసీలో పని చేస్తోన్న 52 వేల మంది కార్మికులు తమ పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం సీసీఎస్ సొసైటీలో జమ చేసిన రూ. 500 కోట్లను యాజమాన్యం వాడుకుందని మజ్దూర్ యూనియన్ ఆరోపించింది. అలాగే కార్మికులు నెలనెలా చెల్లించిన ఈపీఎఫ్ డబ్బులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడుకుందని మజ్దూర్ యూనియన్ ఆరోపించింది. కార్మికులు కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సీసీఎస్ నిధులతో పాటు ఈపీఎఫ్ నిధులను యాజమాన్యం వాడుకోవడం వల్ల కార్మికులు తీవ్రం ఇబ్బంది పడుతున్నారని మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు థామస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు చెల్లించిన నిధులను కూడా యాజమాన్యం వాడుకోవడం వల్ల కార్మికులు తమ అవసరాల కోసం బయట అధిక వడ్డీలతో అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నిధుల విడుదల కోసం ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్, ఈడీ, ఫైనాన్స్ డైరెక్టర్లకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందని థామస్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి నిధులు విడుదల చేయకపోతే ఆర్టీసీ బంద్‌కు పిలుపు ఇస్తామని ఆయన హెచ్చరించారు.

చిత్రం...బస్ భవన్ ఎదుట టీఆర్‌ఎస్ ఆర్టీసీ అనుబంధ కార్మిక సంఘం మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ధర్నా