రాష్ట్రీయం

కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో వచ్చేనెల 23న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వసతి, సదుపాయాలపై బుధవారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వనందునే కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయటం లేదనే ఫిర్యాదులు వచ్చాయని, కౌంటింగ్ నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం ఇవ్వరాదని దిశానిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా నెలరోజుల సమయం ఉన్నందున ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయటంతో పాటు సీటింగ్, లైటింగ్, టేబుల్స్, కుర్చీల వంటి అన్ని ఏర్పాట్లు చూడాలన్నారు. ప్రధానంగా కౌంటింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో తగిన శిక్షణ ఇవ్వాలని, ఈవిషయంలో ఏమాత్రం రాజీ పడరాదన్నారు. కేంద్రాలకు వెళ్లే రహదారుల్లో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజు, అనంతరం అల్లర్లు చెలరేగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా కంటిన్యూస్ అడ్మినిస్ట్రేషన్ కింద కలెక్టర్లు సకాలంలో స్పందించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నిధుల విడుదలలో సమస్యలేవైనా ఎదురైతే ఆర్థిక శాఖ కార్యదర్శిని సంప్రదించి, సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యానవన పంటలకు నీటిఎద్దడి ఎదురైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సమస్యలపై ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. రాష్టస్థ్రాయిలో తాగునీటి సమస్యపై ఇప్పటికే తాను ఉన్నతాధికారులతో సమీక్షించానని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా సమీక్షలు జరపాలన్నారు.
జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు రోజువారీ సమీక్షలు జరిపి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.

చిత్రం... సీఎస్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ద్వివేది. పక్కన డీజీపీ ఠాకూర్