రాష్ట్రీయం

ఆలయాల ఆస్తుల దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీటీడీకి సంబంధించి 1381 కేజీల బంగారం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. ఎటువంటి కాగితాలు లేకుండా వ్యాన్‌లోకి ఇంత బంగారం ఎలా చేరిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి కాగితాలు లేకుండా ఇంత భారీ బంగారాన్ని రవాణా చేస్తున్న సమయంలో టీటీడీ అధికారులు రక్షణగా లేరని సందేహాలు వస్తున్నాయన్నారు. చెన్నై నుంచి తిరుపతి వచ్చేటప్పుడు ఆ వాహనం ప్రధాని రహదారిలో రాలేదని, అనేక గ్రామాల మీదుగా ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వే బిల్ ఎందుకు లేదని, పోలీసు భద్రత లేకుండా బంగారం ఎందుకు తరలిస్తున్నారని అడిగారు. బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి అంశంపైన స్పందించే చంద్రబాబు ఈ టీటీడీ బంగారంపైన స్పందించకుండా ఉండడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామమన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే అంశమన్నారు. దేవాలయాల భూములే కాకుండా, దేవుడికి సంబంధించిన ప్రతి ఆస్తిని దోచుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఐదుగురు సీఎస్‌లలో ముగ్గురు చంద్రబాబు తీరును వేలెత్తిచూపారని విజయసాయిరెడ్డి అన్నారు. ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం చంద్రబాబువైఖరిని తప్పుబట్టారన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను పక్కనపెట్టి పునేఠాను సీఎస్‌గా నియమించారన్నారు. కొంత కాలం టక్కర్ సీఎస్‌గాపనిచేశారన్నారు. తాజాగా సీఎస్‌గా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలుపుకుంటే చంద్రబాబు పనితీరును తీవ్రంగా తప్పుబట్టడం జరిగిందన్నారు. ఇవన్నీ చూస్తుంటే టీటీడీ బంగారం విషయంలో దర్యాప్తు చేసేందుకు నియమించిన మన్మోహన్ సింగ్ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన కోరారు. గోవిందరాజస్వామి దేవాలయంలో రెండు కిరీటాలు దొంగతనానికి గురయ్యాయని, ఈ కిరీటాలను ఏ ఇళ్లను సోదా చేస్తే దొరుగుతాయో పోలీసులకు పూర్తిగా తెలుసన్నారు. విజయవాడలో ఇంతవరకు కూలగొట్టిన 40 ఆలయాలను పునరుద్ధరించలేదన్నారు. టీడీపీ ప్రతినిధి కుటుంబరావుమాదిరిగా తాను కూడా చార్టెర్డ్ అకౌంటెంట్, స్టాక్ బ్రోకర్ అని చెప్పారు. కోడ్ ఉల్లంఘన జరిగితే తమ పార్టీ ఈసీ దృష్టికి తీసుకెళుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రజావేదికను రాష్ట్ర రాజకీయాలకు వాడుకోవడం కోడ్‌కు వ్యతిరేకమన్నారు.