రాష్ట్రీయం

మే 26న ఏపీ ఐసెట్ - 2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 24: ఏపీ ఐసెట్ - 2019 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని ఎస్వీయూ వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలోని తన చాంబర్‌లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మే 26వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ ఐసెట్ - 2019 పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 98 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పరీక్షకు మొత్తం 52,736 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను జాగ్రత పరిశీలించి తమ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలు సరిచూసుకోవాలని, ఎలాంటి పొరబాట్లు ఉన్నా వెంటనే ఏపీ ఐసెట్ - 2019 హెల్ప్‌లైన్ సెంటర్‌ను వెంటనే సంప్రదించాలన్నారు. హాల్‌టికెట్లు లేని అభ్యర్థులను పరీక్షలు రాయడానికి అనుమతించేది లేదన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి తమ హాల్ టికెట్లు, బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్‌లను మాత్రమే తీసుకురావాలన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల్లోపు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని, పరీక్షలు ప్రారంభమైన తరువాత కేంద్రం నుంచి బయటకు రావడానికి ఏమాత్రం అనుమతించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌లైన్ పరీక్షల సమయంలో కంప్యూటర్ సమస్య తలెత్తితే ఇన్విజిలేటర్‌తో మాట్లాడితే మరో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల ఎడమచేతి బొటన వేలు ముద్రను బయోమెట్రిక్ ద్వారా తీసుకుంటామన్నారు. అభ్యర్థులు గోరింటాకు లేదా ఇంకు ఇతర అలంకరణలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. క్యాలికులేటర్లు, లాగ్ టేబుల్స్, పేజర్స్, సెల్‌ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోని అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇతర సమాచారాన్ని అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని తెలియజేశారు.