రాష్ట్రీయం

ఈవో, జేఈవోపై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఈవీఎంల విషయంలో ఎన్నికల అధికారుల వద్ద తొలుత సంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టీటీడీ బంగారం విషయంలో ఈవో, జేఈవోను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. రూ.400 కోట్ల బంగారం అంత నిర్లక్ష్యంగా తరలిస్తే, తప్పు చేసిన వారు వివరణ ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఉన్నత న్యాయస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్, ట్యాంపరింగ్ చేసే టెక్నాలజీ రష్యాకు ఉందంటూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు. వీవీప్యాట్‌ల వీడియోను బహిరంగంగా ప్రదర్శన చేసిన చంద్రబాబుపైన ఎన్నికల కమిషన్ సుమోటోగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంల దొంగలను ప్రత్యేకంగా విమానంలో వెంట పెట్టుకుని తిరిగింది చంద్రబాబేనని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో అధికార యంత్రాంగాన్ని బెదిరించడం మానుకోవాలని టీడీపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల వ్యయంపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, అవన్నీ ఆ పార్టీకి అతికినట్లు సరిపోతాయని బీజేపీ నేత వ్యాఖ్యానించారు.