రాష్ట్రీయం

దేశంలో మరో 12 అణు విద్యుత్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: భారతదేశంలో పరిశ్రమలు, గృహ వినియోగం కోసం నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేసేందుకు త్వరలో 12 అణు శక్తి కర్మాగారాలు ఏర్పాటు చేయనున్నట్లు అణు ఇంధన సంఘం చైర్మన్ కేఎన్ వ్యాస్ చెప్పారు. రష్యాలోని సోచిలో రోసాటోమ్ స్టేట్ అటామిక్ ఎనర్జీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ అణు ఎక్స్‌పో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఇక్కడ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. అణు సాంకేతికత అనేది అనేక రకాల ఉపయోగాలతో జీవితాలను మెరుగుపరచడమే కాకుండా వెలకట్టలేనటువంటి శుభ్రమైన, కాలుష్యరహితమైన శక్తిని అందిస్తుందన్నారు. భారత అణు కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా అణు సాంకేతికత అనేది విద్యుత్ రంగానికి చాలా అవసరమన్నారు. మెరుగైన జీవనానికి ఇతర సామాజిక ప్రయోజనాలకు అణు ఇంధనాన్ని నిర్దేశించామన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 220 నుంచి 250 మెగావాట్ల రియాక్టర్‌కు చెందిన చిన్న యూనిట్ 99.3 శాతం సామర్థ్యంతో 962 రోజులు నిరంతరాయంగా పనిచేస్తున్నదన్నారు. ఇది ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరంలో మెరుగైన జీవనానికి అణు శక్తి అనే నినాదంతో ఆటమ్ ఎక్స్‌పో 2019 పేరుతో సోచిలో 11వ అంతర్జాతీయ సదస్సును నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఎక్స్‌పోలో దాదాపు 3600 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. ఔషధ రంగంలో వినూత్నమైన మెటీరియల్స్ సృష్టించడంలో అంతరిక్ష పరిశోధనలో ఆర్కిటిక్ ప్రాంతంలో ఆనే్వషణలను చేపట్టామన్నారు. అణు శక్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి పలు రంగాల్లో నూతన అవకాశాలను ఆనే్వషిస్తూ వాటిని చర్చించడంలో ఆటమ్ ఎక్స్‌పో ఒక వేదికను అందించినట్లు చెప్పారు. అణు శక్తి సాంకేతికతను కేవలం శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా వైద్యులు, శాస్తవ్రేత్తలకు సహాయకంగా కూడా ఉపయోగిస్తున్నారన్నారు. రేడియో థెరపీ పొందుతున్న క్యాన్సర్ రోగులకు 60 శాతంపైగా మెరుగైన ఉపశమనం అందించడం ద్వారా వైద్య రంగంలోని సాంకేతిక ఆవిష్కరణల్లో భారీ మెరుగుదలను సాధించినట్లు చెప్పారు.

చిత్రం... కేఎన్ వ్యాస్