రాష్ట్రీయం

భారీ ప్రాజెక్టులకు ప్రణాళిక రూ.6,503 కోట్ల వ్యయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) యాజమాన్యం ఇపుడు ముఖ్యమైన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో నిర్వహించే భారీ ప్రాజెక్టులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసింది. అంచనా వ్యయంతో కూడిన ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు, నెట్‌వర్క్ సామర్థ్యం పెంపునకు సంబంధించిన ప్రాజెక్టుల వ్యయ అంచనాలను, విద్యుత్ లోడును పరిగణనలోకి తీసుకుంటూ పెట్టుబడుల ప్రణాళికలను ప్రతిపాదించారు. అదనపు సబ్‌స్టేషన్లు, మీటరింగ్, అనుబంధ పరికరాల కొనుగోలు, అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, కేబుళ్ళు, నెట్‌వర్క్ అభివృద్ధి పనులు, సాంకేతికపరమైన అప్‌గ్రేడేషన్, మరమ్మతుల నిర్వహణకు ఏకంగా రూ.6,503 కోట్ల వరకు అంచనా వ్యయాన్ని నిర్దేశించుకుంటున్నారు. వచ్చే అయిదేళ్ళలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు వ్యయంతో పాటు దశలవారీగా ఆయా ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో సంస్థ యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.901 కోట్లు, 2020-21లో రూ.950 కోట్ల మేర క్యాపిటల్ పెట్టుబడుల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటితోపాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1102 కోట్లు, 2022-23లో రూ.1285 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1461 కోట్ల వరకు పెట్టుబడుల ప్రణాళికను తయారు చేశారు. ఏడాది అవసరమైన చోట విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతికపరమైన సమస్యలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనే విద్యుత్ పరికరాలను ఉపయోగిస్తూ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. రెండు దశాబ్దాల కాలంగా ఏపీఈపీడీసీఎల్ అందిస్తున్న విద్యుత్ సేవలతో వినియోగదారుల ప్రశంసలను అందుకుంటోంది. ఏపీఎస్‌ఇబీని విడిదీసీ దీనిని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలుగా ఏర్పాటు చేసింది. విడిపోయిన నాలుగింటిలో ఐదు జిల్లాలతో కూడిన ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడిన డిస్కం తొలి నుంచి మెరుగైన, నాణ్యతతో కూడిన విద్యుత్‌ను ఇస్తూనే మరోపక్క సంస్థ ఆర్ధిక పుష్టి కోసం అనేక రకాలైన ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తోంది.