రాష్ట్రీయం

సుజనా చౌదరికి సీబీఐ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఆంధ్ర బ్యాంకును మోసం చేసిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ గురువారం నోటీసు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు శుక్రవారం ఉదయం బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని సీబీఐ తన నోటీస్‌లో పేర్కొంది. చెన్నై కేంద్రంగా ఎలక్ట్రికల్ విడి భాగాల తయారీ చేసే బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ తమను రూ.71 కోట్ల మేర మోసం చేసిందని ఆంధ్రాబ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ కాకులమర్రి శ్రీనివాస్ కళ్యాణ్‌రావుతో పాటు ఐదుగురు డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, తదితర అభియోగాలపై నమోదైన ఈ కేసులో సుజనా చౌదరికి నోటీసులు జారీ చేసింది.
నాకెలాంటి సంబంధం లేదు: సుజనా
సీబీఐ బెంగళూరు శాఖ జారీ చేసిన నోటిసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుజనా చౌదరి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2003 నుంచి 2014 వరకు మూడు కంపీనీలలో ఎగ్జిక్యూటీవ్‌యేతర స్థానాల్లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే 2014 నుంచి ఈ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ కానీ నాన్ ఎగ్జిక్యూటీవ్ స్థానాల్లో తాను లేనని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ కంపెనీలు జరిపిన లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం కానీ, అవగాహన కానీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో జారీ చేసిన నోటీసులపై తగిన చర్యలు తీసుకోనున్నట్టు సుజనా చౌదరి హెచ్చరించారు.