రాష్ట్రీయం

మే 15 నాటికి కొత్త మెమోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేసి మే 15 నాటికి వారికి కొత్త మెమోలు జారీ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ పరీక్షలకు జనరల్, ప్రైవేటు, వొకేషనల్ కలిపి ఫస్టియర్, సెకండియర్‌లో 8,70,924 మంది హాజరుకాగా, వారిలో 5,42,524 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,28,400 మంది ఫెయిలయ్యారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లకు ఫెయిలైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోనవసరం లేదు, ఇదంతా వారికి ఉచితంగా బోర్డు చేపడుతుంది. పాసైన వారు మాత్రం నిర్ణీత రుసుం చెల్లించి రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు అధికారులు తెలిపారు. అలాగే ఫెయిలైన అభ్యర్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి సైతం దరఖాస్తు చేసుకోవాలని, అందుకు మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బోర్డు అధికారులు చెప్పారు. ఆర్‌టీఐ కింద సమాధాన పత్రాల కాపీలను ఇవ్వడం కుదరదని, సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై వస్తున్న వార్తలను విశ్వసించవద్దని బోర్డు అధికారులు పేర్కొన్నారు. గత మార్చిలో జరిగిన పరీక్షల్లో 4,09,113 మంది ఫస్టియర్ విద్యార్ధులు పరీక్షలు రాయగా, వారిలో
2,47,407 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే సెకండియర్‌లో 3,82,534 మంది పరీక్ష రాయగా వారిలో 2,47,755 మంది పాసయ్యారు. వొకేషనల్ విద్యార్థులు ఫస్టియర్‌లో 43,520 మంది పరీక్ష రాయగా వారిలో 23,168 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 35,737 మంది రాయగా, వారిలో 24,194 మంది పాసయ్యారు. ఇంత వరకూ 30,569 మంది రీ వెరిఫికేషన్‌కు, మరో 6వేల మంది రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరైనా ఫెయిలైన వారు ఉంటే వారు ఇప్పటికే చెల్లించిన ఫీజును వెనక్కు చెల్లిస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే బోర్డు అధికారులు సిబ్బందిని సన్నద్ధం చేశారు. గతంలో మూల్యాంకనం చేసిన అధ్యాపకులను వెంటనే స్పాట్ కేంద్రాల్లో రిపోర్టుచేయాల్సిందిగా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అధ్యాపకులకు స్పాట్‌లో పనిచేసిన తర్వాత సెలవులు మంజూరు చేస్తామని సూచించారు.