రాష్ట్రీయం

కోడ్ ఉంది జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 18వ అవిర్భావ దినోత్సవాన్ని శనివారం రాష్టవ్య్రాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని గుర్తెరిగి, జాగ్రత్తగా ఉండాలని, నిరాడంబరంగా జరుపుకోవాలని కోరింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు పాల్గొనాల్సిందిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ సారి ఆవిర్భావ దినోత్సవాల్లో హంగూ ఆర్భాటాలు వద్దని సూచించారు. ఈ సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్టస్థ్రాయి వరకు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కేటీఆర్ కోరారు. పార్టీ రాష్ట్ర బాధ్యులు మొదలుకుని జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తోన్న నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ కోరారు.