రాష్ట్రీయం

బోర్డు కార్యదర్శిదే బాధ్యత: లెక్చరర్ల సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఇంటర్మీడియట్ పరీక్షల్లో వైఫల్యానికి బోర్డు కార్యదర్శి బాధ్యత వహించాలని ఇంటర్ విద్య ఐక్య కార్యాచరణ కమిటీ, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకున్న చొరవతోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల శాతం పెరిగిందని, 600కు పైగా ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కాలేజీలు మూతపడ్డాయని అన్నారు. పాఠశాల విద్య, డిగ్రీ విద్యార్థుల సంఖ్య తగ్గినా, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం ప్రత్యేకించి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు తండాలకు వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీల్లోకి పంపించేలా చేయడమేనని అన్నారు. తాజాగా సంక్షోభానికి తెరదించుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన వివాదాలకు కేంద్ర బిందువు కార్యదర్శేనని వ్యాఖ్యానించారు. ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌లకు అనుమతించి ఫెయిలైన 3.28 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ఇంటర్ అధ్యాపకుల ఐకాస కృతజ్ఞత తెలిపింది. అధ్యాపకుల ఐకాసాతో విద్యాశాఖ కార్యదర్శి జనార్థనరెడ్డి సమావేశమై రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఏర్పాట్లుపై చర్చించారు. వేసవి సెలవులతో సంబంధం లేకుండా విద్యాశాఖలోని 25వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియకు సహకరించాలని విద్యాశాఖ కార్యదర్శి కోరారని, దానికి తాము సమ్మతించామని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం అవసరమైతే అదనపు గంటలు పనిచేయాలని కోరారని చెప్పారు. తొలి నుండి బోర్డులో జరుగుతున్న పరిణామాలను తాము చెబుతూనే ఉన్నామని, బోర్డు కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలు, సాచివేత ధోరణే ఈ వివాదాలకు కారణమైందని అన్నారు. సరైన ప్రమాణాలు లేని సంస్థకు సాఫ్ట్‌వేర్ అందించే బాధ్యతను అప్పగించడం వల్లనే ఈ సమస్యలు అన్నీ ఉత్పన్నమయ్యాయని మధుసూధనరెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో తప్పులు వస్తాయని తాము మూడు నెలల ముందే చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. రీ వెరిఫికేషన్ బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శికి అప్పగించడం మంచి నిర్ణయమని అన్నారు. ఇంటర్ బోర్డు రద్దు చేస్తారని తాము అనుకోవడం లేదని, సీఎం అన్ని అంశాలనూ పరిశీలిస్తారని తాము భావిస్తున్నట్టు మధుసూధనరెడ్డి చెప్పారు. లోపాలు ఉన్నది వ్యక్తుల్లో తప్ప వ్యవస్థలో కాదని వ్యాఖ్యానించారు.